/rtv/media/media_files/2025/03/30/JswmzwgsoeJZ7bHDS1DI.jpg)
Chiranjeevi - Anil Ravipudi
Chiranjeevi - Anil Ravipudi: వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి, సంక్రాంతికి వెంకటేష్ తో చేసిన "సంక్రాంతికి వస్తున్నాం" మూవీతో భారీ విజయం సాధించి. 300 కోట్ల గ్రాస్ వసూళ్లతో అందరిని ఆశ్చర్యపరిచాడు. అయితే అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మన మెగా స్టార్ చిరంజీవితో చేస్తున్నాడు.
Also Read:వారికి దగ్గరయ్యేందుకు మలయాళం నేర్చుకుంటున్నాను అంటున్న ప్రియాంక!
ఈ ప్రాజెక్ట్ పై తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేస్తూ, ఈ సినిమాలో చిరంజీవి క్యారెక్టర్ పేరు "శంకర్ వరప్రసాద్" అని, ఈ సినిమా ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అని, స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయింది అని వెల్లడించారు.
Also Read:ఉగాది పండుగ అసలు ఎందుకు జరుపుకుంటారు? ఉగాది పచ్చడికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి?
ఉగాది సందర్భంగా..
ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థలు "షైన్ స్క్రీన్స్", చిరంజీవి కూతురు సుస్మిత గారి "గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్" సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి, ఉగాది పర్వదినం సందర్భంగా, ఈ రోజు ఓపెనింగ్ పూజా కార్యక్రమం ప్రారంభం కానుంది.
Also Read: ప్రతిదాడులు తప్పవు..లెబనాన్ కు నెతన్యాహు హెచ్చరికలు!
అయితే, ఈ వేడుకలో వెంకటేష్ గెస్ట్ గా విచ్చేస్తారని, అలాగే ఈ సినిమాలో "వెంకిమామ" కూడా ఒక చిన్న గెస్ట్ రోల్ చేస్తారని టాక్ నడుస్తోంది. ఉగాది స్పెషల్ గా ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం మొదలు కానుంది.