సెలెబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి విజయలక్ష్మీ అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఈ విషయాన్ని వేణు స్వామి స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ' 'మా అమ్మగారు ఈ రోజు ఉదయం పరమపదించారు' అంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ పోస్ట్ చూసిన వేణు స్వామి ఫాలోవర్స్.. ఆయనకు సానుభూతి తెలుపుతున్నారు. ఇక వేణు స్వామి విషయానికొస్తే.. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో ఫుల్ పాపులర్ అయ్యాడు. సెలెబ్రెటీలకు సంబంధించి ఇతను చెప్పిన అంచనాలు చాలా వరకు నిజమయ్యాయి. అయితే ఈ మధ్య వేణు స్వామి వైఎస్ జగన్ గెలుస్తారని చెప్పారు. కానీ అది జరగలేదు.
Also Read : స్పీడ్ పెంచిన 'గేమ్ ఛేంజర్' టీమ్.. నెక్స్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చిన తమన్
దాంతో ఈయన్ని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు. ఈ క్రమంలోనే ఇక నుంచి సోషల్ మీడియాలో జాతకాలు చెప్పడం మానేస్తానని స్వయంగా సంచలన ప్రకటన చేశారు. సోషల్ మీడియాకు ఆయన దూరంగా ఉండాలని కోరుకుంటున్నా నెటిజన్స్ మాత్రం ఆయన్ను వదలడం లేదు.
సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన పోస్ట్లు, మీమ్స్ అన్నీ హల్చల్ చేస్తునే ఉన్నాయి. ఇక రీసెంట్ గా క్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ నిశ్చితార్థం జరుపుకున్న అనంతరం.. వాళ్లిదరు కూడా విడిపోతారని బాంబ్ పేల్చి ఇటీవల మళ్ళీ వార్తల్లోకెక్కాడు.