Gautami Chaudhary: బిగ్ షాక్ .. ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరిపై కేసు నమోదు!

ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి‌పై ఆమె భర్త, నటుడు ధర్మ మహేష్ ఫోన్ ట్యాపింగ్, బెదిరింపుల ఆరోపణలతో కేసు నమోదు అయింది. గౌతమి ఈ ఆరోపణలను ఖండిస్తూ తప్పుడు కేసు పెట్టారని తెలిపింది.

New Update
Gautami Chaudhary

Gautami Chaudhary

Gautami Chaudhary: ప్రముఖ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గౌతమి చౌదరి గత కొద్దికాలంగా తన భర్త, సినీ నటుడు ధర్మ మహేష్ తో ఉన్న దాంపత్య వివాదం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కూకట్‌పల్లి పీఎస్‌లో గౌతమిపై కేసు నమోదు అయింది. తన వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వీడియోలను మీడియాలో పెడతానని బెదిరిస్తున్నారని, అలాగే తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తూ మహేష్ ఫిర్యాదు చేశారు. ఈ వివాదం పరిష్కారం కోసం గౌతమి వర్గం తమను రూ. 10 కోట్లు డిమాండ్ చేస్తూ బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని కూడా ధర్మ మహేష్ ఆరోపించారు.  

తనపై వచ్చిన ఆరోపణలను గౌతమి చౌదరి తీవ్రంగా ఖండించారు. తనపై FIR ఫైల్‌ అయ్యింది నిజమేనని స్పష్టం చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసు పెట్టారన్నారు. నేను ఎలాంటి ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. కేవలం నన్ను, నా క్యారెక్టర్‌ని దిగజార్చడం కోసం మా భర్త, ఒక అడ్వకేట్ కలిసి ఫేక్ కేసు నమోదు చేశారని ఆమె స్పష్టం చేశారు తనకు సంబంధం లేని వ్యక్తితో అంటగడుతున్నారని మండిపడ్డారు. ఒక గ్రూప్‌తో కుమ్మక్కై నాపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, తానెప్పుడు సింగిల్‌గానే ఫైట్ చేశా.. చేస్తున్నానని వెల్లడించారు. తాను ఎవ్వరిని రూ. 10 కోట్లు అడగలేదని గౌతమి చౌదరి వెల్లడించారు.  తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మరియు తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తానని, తనను విమర్శిస్తున్న వారందరిపై కూడా కేసులు పెడతానని గౌతమి తెలిపారు.

Also Read: కాల్చి పారేస్తా నా కొడకా...భూ వివాదం.. తుపాకీతో బెదిరింపు

ఇక భర్త ధర్మ మహేష్‌కి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ రీతూ చౌదరితో సహా వేరే మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ గౌతమి చౌదరి సాక్ష్యాలతో కూడిన వీడియోలు, చాటింగ్ స్క్రీన్‌షాట్‌లను మీడియాకు విడుదల చేశారు. దీనికి ప్రతిగా ధర్మ మహేష్ కూడా గౌతమిపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు చెడు అలవాట్లు ఉన్నాయని, పెళ్లికి ముందే గర్భవతి అయి అబార్షన్ చేయించుకున్నారనని, వేరే పురుషులతో సంబంధాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. వీరిద్దరి మధ్య కొడుకు కస్టడీకి సంబంధించిన గొడవ కూడా కొనసాగుతోంది.

Advertisment
తాజా కథనాలు