NTR Fan :
‘దేవర’ సినిమా చూసేవరకు తనను బ్రతికించండి అని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్(19) బ్లడ్ క్యాన్సర్ తో బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక తాను బతకనని.. దేవర రిలీజ్ సెప్టెంబర్ 27 వరకైనా బతికించండని వైద్యులను వేడుకుంటున్నాడు.
దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైనా కౌశిక్ తల్లిదండ్రులు.. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని అతని తల్లిదండ్రులు ఎన్టీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ నేపథ్యంలో RTV. కౌశిక్ తల్లి దండ్రులతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది.
అలాగే కౌశిక్ ను సైతం కలిసింది. ఈ మేరకు కౌశిక్ RTV ద్వారా ఎన్టీఆర్ తో కలిపించాలని కోరారు. 'నేను ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను. కొన్ని రోజుల్లో కీమో థెరఫి స్టార్ట్ చేస్తారు. ఆలోపు నన్ను ఎన్టీఆర్ తో కలిసేలా చేస్తే నేను హ్యాపీగా కీమో థెరపీ తీసుకుంటాను. ఒక్కసారి ఎన్టీఆర్ ను కల్పించాల్సిందిగా RTV వారిని రిక్వెస్ట్ చేస్తున్నా' అని కౌశిక్ RTV తో మాట్లాడారు.