'దేవర' నన్ను బతికించు.. కన్నీరు పెట్టిస్తున్న అభిమాని వీడియోలు క్యాన్సర్ పేషేంట్ కౌశిక్ RTV ద్వారా ఎన్టీఆర్ తో కలిపించాలని కోరారు. 'నేను ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నా. కొన్ని రోజుల్లో కీమో థెరఫి స్టార్ట్ చేస్తారు. ఆలోపు నన్ను ఎన్టీఆర్ తో కలిసేలా చేస్తే హ్యాపీగా కీమో థెరపీ తీసుకుంటానని RTV తో మాట్లాడారు. By Anil Kumar 13 Sep 2024 in సినిమా New Update షేర్ చేయండి NTR Fan : ‘దేవర’ సినిమా చూసేవరకు తనను బ్రతికించండి అని డాక్టర్లను వేడుకుంటున్నాడు తారక్ అభిమాని. ఏపీకి చెందిన కౌశిక్(19) బ్లడ్ క్యాన్సర్ తో బెంగళూరులోని కిడ్వై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇక తాను బతకనని.. దేవర రిలీజ్ సెప్టెంబర్ 27 వరకైనా బతికించండని వైద్యులను వేడుకుంటున్నాడు. "ఎన్టీఆర్ గారు మాకు ఈ ఒక్క సాయం చేయండి. మా కొడుకుని ఒక్కసారి కలవండి.." జూ.. ఎన్టీఆర్ వీరాభిమాని కౌశిక్ తల్లితండ్రులు అభ్యర్థన.. @tarak9999 #NTRFan #RTV pic.twitter.com/pq4GSsztf1 — RTV (@RTVnewsnetwork) September 13, 2024 దీంతో తీవ్ర భావోద్వేగానికి లోనైనా కౌశిక్ తల్లిదండ్రులు.. తమ బిడ్డ చివరి కోరిక తీర్చాలని అతని తల్లిదండ్రులు ఎన్టీఆర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రాధేయపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.ఈ నేపథ్యంలో RTV. కౌశిక్ తల్లి దండ్రులతో ప్రత్యేక ఇంటర్వ్యూ నిర్వహించింది. కొన్ని రోజుల్లో తనకు కీమో థెరపీ మొదలు పెడతారని.. ఈ లోగా తన హీరో ఎన్టీఆర్ తో కలిపించాలని RTV ద్వారా కోరారు కౌశిక్. క్యాన్సర్ తో చావుబతుకుల మధ్య ఉన్న కౌశిక్ దేవరా సినిమా విడుదలయ్యే వరకు అయినా తనను బతికించాలని వేడుకుంటున్నాడు. కౌశిక్ అకౌంట్: 41529226922, SBI, IFC: SBIN0020926కు… pic.twitter.com/4e1VNzRsmx — RTV (@RTVnewsnetwork) September 13, 2024 అలాగే కౌశిక్ ను సైతం కలిసింది. ఈ మేరకు కౌశిక్ RTV ద్వారా ఎన్టీఆర్ తో కలిపించాలని కోరారు. 'నేను ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాను. కొన్ని రోజుల్లో కీమో థెరఫి స్టార్ట్ చేస్తారు. ఆలోపు నన్ను ఎన్టీఆర్ తో కలిసేలా చేస్తే నేను హ్యాపీగా కీమో థెరపీ తీసుకుంటాను. ఒక్కసారి ఎన్టీఆర్ ను కల్పించాల్సిందిగా RTV వారిని రిక్వెస్ట్ చేస్తున్నా' అని కౌశిక్ RTV తో మాట్లాడారు. #ntr మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి