Shahrukh khan : నెక్స్ట్ చంపేది షారుఖ్ నే!.. హత్య బెదిరింపులు

బాలీవుడ్ లో స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ముంబైలోని బాంద్రా పోలీసుల వివరాల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరు పై నమోదైన నంబర్ నుంచి హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది.

New Update
sharukh (1)

Shah Rukh Khan

Shah Rukh Khan: బాలీవుడ్ హీరోలకు వరుసగా హత్య బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో స్టార్ హీరోకు చంపేస్తామని బెదిరింపుల మెసేజ్ రావడం సంచలనంగా మారింది. 

షారుఖ్ ఖాన్ కు బాంబ్ బెదిరింపులు 

మహారాష్ట్రలోని ముంబైలోని బాంద్రా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు షారుఖ్ ఖాన్‌కు హత్య బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన ఫైజాన్ అనే వ్యక్తి పేరు పై నమోదైన ఫోన్  నెంబర్ నుంచి ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు షారుఖ్ ఖాన్ బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read : 'అమరన్' సక్సెస్ మీట్.. నితిన్ హిట్ సాంగ్ ను తెలుగులో పాడిన శివకార్తికేయన్

Also Read: అందుకే నాన్నతో సినిమా చేయలేదు.. అయ్యో! దుల్కర్ ఇలా చెప్పడేంటి..!

Advertisment
తాజా కథనాలు