NTR Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ బడా యాక్టర్..!

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘డ్రాగన్’లో అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2026 జూన్ 25న విడుదల కానుంది.

New Update
NTR Dragon

NTR Dragon

NTR Dragon: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. బ్లాక్‌బస్టర్ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ‘డ్రాగన్’ అనే వర్కింగ్ టైటిల్‌తో షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్‌తో, పలు భాషల్లో విడుదలయ్యేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు.

Anil Kapoor in NTR Dragon Movie

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన పెద్ద అప్‌డేట్ అధికారికంగా బయటకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారని ఖరారైంది. గత కొంతకాలంగా ఆయన కాస్టింగ్‌పై వార్తలు వినిపించినా, తాజాగా అనిల్ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని స్వయంగా నిర్ధారించారు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది.

‘డ్రాగన్’ సినిమా అనిల్ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న రెండో చిత్రం కావడం విశేషం. వీరిద్దరూ ఇప్పటికే ‘వార్ 2’లో కలిసి నటించారు. అలాగే అనిల్ కపూర్‌కు ఇది రెండో సౌత్ దర్శకుడితో సినిమా. ఇటీవలే ఆయన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘యానిమల్’లో నటించారు. అయితే ‘డ్రాగన్’లో అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపించనున్నారన్న విషయాన్ని చిత్రబృందం సీక్రెట్ గా ఉంచుతోంది. దీంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్‌తో మరోసారి కూడా కలిసి పని చేయబోతున్నానని అనిల్ కపూర్ తెలిపారు. ఇది వీరిద్దరి మూడో సినిమా కావొచ్చని బాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఈ సినిమా YRF స్పై యూనివర్స్కు సంబంధించిన ప్రత్యేక చిత్రం అయ్యే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.

కాస్టింగ్ విషయానికి వస్తే, ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమెతో పాటు పలు భాషలకు చెందిన ప్రముఖ నటులు ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. అందుకే సినిమా స్థాయి చాలా పెద్దగా ఉండనుందని అంచనా వేస్తున్నారు.

సంగీతాన్ని రవి బస్రూర్ అందిస్తున్నారు. ఆయన నేపథ్య సంగీతం సినిమాకు మరో బలంగా నిలుస్తుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ సినిమా 2026 జూన్ 25న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇది అతిపెద్ద సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అనిల్ కపూర్ వంటి స్టార్ చేరడంతో ‘డ్రాగన్’ పాన్ ఇండియా స్థాయిలో మరింత బలంగా మారింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు