Blakrishna Fan: నా పేరు బాలకృష్ణ.. నా పిల్లల పేర్లు బ్రాహ్మణి, తేజశ్విని - వీరాభిమాని

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో 'అఖండ 2: తాండవం' చిత్రం నుంచి తాజాగా సెకండ్ సాంగ్ ‘జాజికాయ జాజికాయ’ విడుదలైంది. ఈ సాంగ్‌ ఈవెంట్‌లో ఒక అనూహ్య, ఆనందకర సంఘటన చోటు చేసుకుంది. వైజాగ్‌లోని జగదాంబ థియేటర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు బాలయ్య అభిమానులు భారీగా తరలివచ్చారు.

New Update
Akhanda 2 Thaandavam Jajikaya Jajikaya

Akhanda 2 Thaandavam Jajikaya Jajikaya

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2: తాండవం' చిత్రం నుంచి తాజాగా సెకండ్ సాంగ్ ‘జాజికాయ జాజికాయ’ విడుదలైంది. ఈ సాంగ్‌ ఈవెంట్‌లో ఒక అనూహ్య, ఆనందకర సంఘటన చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు బాలయ్య అభిమానులు భారీగా తరలివచ్చారు. 

Akhanda 2 Thaandavam

అందులో ఒక అభిమాని ఉద్వేగంగా మాట్లాడాడు. ఆ మాటలు వినగానే బాలకృష్ణ ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. అదే సమయంలో అక్కడున్నవారంతా.. ఆ అభిమాని వైపు చూసి ఆనందంతో చప్పట్లు కొట్టారు. మరి ఆ అభిమాని ఏమన్నాడో అనే విషయానికొస్తే.. 

బాలయ్య వీరాభిమాని మాట్లాడుతూ.. ‘‘ నా పేరు బాలకృష్ణ. నాకు ఇద్దరు కూతుర్లు. అందులో ఒకరి పేరు బ్రాహ్మణీ, మరొకరి పేరు తేజశ్విని. నేను బాలకృష్ణ బర్త్ డే రోజు జూన్ 10న పెళ్లి చేసుకున్నాను. దానికి మించిన ముహూర్తం నాకు ఇంక ఏదీ లేదు. అందుకనే నేను జూన్ 10న పెళ్లి చేసుకున్నాను. అలాగే నా పెద్ద బాబు.. చంద్రబాబు బర్త్ డే రోజు అంటే ఏప్రిల్ 20వ తేదీన పుట్టాడు. మా అన్నయ్య వాళ్ల బాబు కూడా అదే రోజున పుట్టాడు. ఏది జరిగినా.. బాలయ్య బాబుతోనే మాది కూడా అలా జరిగిపోతూ ఉంటుంది. జై బాలయ్యా’’ అంటూ ఆ వీరాభిమాని చెప్పాడు. 

అతడి మాటలకు బాలయ్య ఉప్పొంగిపోయారు. ఇలాంటి అభిమానులు ఉండటం తన అదృష్టమంటూ ఆనందం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆ వీరాభిమాని మాటలు వినగానే చుట్టూ ఉన్నవారంతా చప్పట్లతో విజుల్స్ వేసి, అరిచి గోలగోల చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. 

Advertisment
తాజా కథనాలు