Bigg Boss Promo: బిగ్ బాస్ దసరా స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు. ఈ పండగ స్పెషల్ ప్రోమోలో సినీ తారలు సందడి చేశారు. కొత్త సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా సిద్దు జొన్నలగడ్డ, వైవా హర్ష, రాశీ కన్నా, శ్రీనిధి శెట్టి, కిరణ్ అబ్బవరం, రోషన్, శ్రీదేవి బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేశారు. తెలుసు కదా మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సిద్దు టీమ్ సందడి చేయగా.. కే-ర్యాంప్ మూవీ కోసం కిరణ్ అబ్బవరం, హీరోయిన్ యుక్తి తరేజా సందడి చేశారు. అలాగే 'బ్యాండ్ మేళం' ప్రమోషన్స్ మేరకు రోషన్, శ్రీదేవి బిగ్ బాస్ స్టేజ్ పై అలరించారు.
హోస్ట్ నాగార్జున సిద్దూ పెళ్లి టాపిక్ గురించి మాట్లాడుతూ.. "సిద్దూ నీకు రాధికక్క లాంటి వైఫ్ రావాలి" అంటూ నవ్వులు పూయించారు. దానికి సిద్దూ "ఎందుకు సార్ నాపై అంత కోపం" అని నవ్వుకున్నారు. అనంతరం నాగార్జున హౌజ్ మేట్స్ తో కొన్ని ఫన్నీ టాస్కులు ఆడించారు. దసరా స్పెషల్ ఎపిసోడ్ సందర్భంగా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్స్, సింగర్స్ లైవ్ పర్ఫార్మెన్సులతో స్టేజ్ సందడిగా మారింది.
ప్రియా ఎలిమినేషన్
ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. ప్రియా శెట్టి బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఈ వారం పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, రీతూ, ఫ్లోరా, రాము రాథోడ్, హరిత హరీష్ నామినేషన్స్ లో ఉండగా.. ఆన్ లైన్ ఓటింగ్ పోల్స్ ప్రకారం ప్రియా, పవన్ కళ్యాణ్, రీతూ లీస్ట్ లో ఉన్నారు. ఈ ముగ్గురిలో ప్రియా బయటికి వెళ్లే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. హౌజ్ లో ప్రియా ప్రవర్తన, ఆతతీరే ఆమె ఓటింగ్ తగ్గిపోవడానికి కారణమని నెటిజన్ల అభిప్రాయం. అనవసరమైన విషయాల్లో కూడా ఆర్గుమెంట్స్ చేయడం, సంచాలకుడిగా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం, రెండు వారాలైన గేమ్ లో పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయకపోవడం ప్రియా ఎలిమినేషన్ కారణాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు.
అయితే ప్రియా శెట్టి కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఎలిమినెట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని టాక్. ఈ రెండు వారాలు గమనిస్తే పవన్ కళ్యాణ్ ఆట కూడా పెద్దగా కనిపించలేదని ప్రేక్షకులు అభిప్రాయం.
తప్పించుకున్న ఫ్లోరా..
ఈ వారం నామినేషన్స్ లిస్ట్ చూడగానే ముందుగా అందరూ ఫ్లోరా ఎలిమినెట్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా బిగ్ బాస్ ఇచ్చిన ఇమ్యూనిటీ టాస్క్ లో గెలిచి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యింది ఫ్లోరా. దీంతో ప్రియా లీస్ట్ లోకి వచ్చేసింది. ఫ్లోరకు అదృష్టం ఫేవికాల్ పట్టినట్లు పట్టిందని ప్రేక్షకులు భావిస్తున్నారు. మొదటి వారం నుంచి మూడవ వారం వరకు ఏమీ ఆడకపోయినా సేవ్ అవుతూ వస్తోంది ఫ్లోరా. లాస్ట్ వీక్ తాను సేవ్ అయ్యాయానని తానే నమ్మలేకపోయింది.
Also Read: TN Stampede: విజయ్ ర్యాలీ తొక్కిసలాట ఘటనపై స్పందించిన మెగాస్టార్.. ట్వీట్ వైరల్!