Bigg Boss 8: లవ్ సీక్రెట్ చెప్పేసిన యష్మీ.. అతను మరెవరో కాదు..!

బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున యష్మీని ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పమని అడగగా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించానని.. చేయి పై S అక్షరంతో ఉన్న టాటూను చూపించింది.

New Update

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభంలో చెప్పినట్లుగానే రోజుకో ట్విస్ట్, టర్నులతో ఆసక్తికరంగా కొనసాగుతోంది. తాజాగా బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున హౌస్ మేట్స్ తో కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడించారు. ఈ క్రమంలో నాగార్జున యష్మీని  సరదాగా ఓ ప్రశ్న అడిగారు.  "మీ నాన్న నీకోసం లెటర్ లో ఏం రాశారో చెప్పాలంటే.. నీ గురించి ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పాలి అని అడిగారు." దీంతో యష్మీ తన లవ్ స్టోరీ గురించి బయటపెట్టింది. 

Also Read: సెట్‌లో ఆ బాధ తట్టుకోలేక రోజు ఇంటికెళ్లి ఏడ్చేదాన్ని.. యానిమల్ బ్యూటీ!

 యష్మీ  లవ్ స్టోరీ 

కాలేజ్ డేస్ తాను ఒక అబ్బాయిని ప్రేమించానని.. చేయి పై అతని పేరుతో ఉన్న 'S' అక్షరం టాటూను చూపించింది. ఇక నాగార్జున నవ్వుతూ  'S' అంటే ఎవరూ అని అడగగా.. పేరు వద్దులే సార్ అంటూ సిగ్గుపడింది యష్మీ. ఆ తర్వాత నాగార్జున..  యష్మీకి ఉత్తరంలో తన నాన్న రాసిన మాటలు చెప్పగానే ఆమె ఎమోషనల్ అయినట్లుగా ప్రోమోలో చూపించారు. 

Also Read:'మా ఇంట మహాలక్ష్మి పుట్టింది'.. తల్లిదండ్రులైన రాకింగ్‌ రాకేష్, సుజాత

డబుల్ ఎలిమినేషన్ 

ఇక ఈ వారం ఎలిమినేషన్ విషయానికి వస్తే.. డబుల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్స్ ఉన్నట్లుగా  నెట్టింట చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఆదిత్య మిడ్ వీక్ ఎలిమినేట్ అవ్వగా.. సండే ఎపిసోడ్ లో నైనిక ఎలిమినేట్ అవ్వబోతుందని అంటున్నారు. మొదటి వారంతో పోలిస్తే ఆ తర్వాత వారాల్లో నైనిక గేమ్ అంతగా కనిపించలేదని ప్రేక్షకులు భావిస్తున్నారు. అందుకే ఆమె ఈ వారం బయటకు వెళ్లొచ్చని టాక్. డబుల్ ఎలిమినేషన్ తో పాటు ఈ వారం మరో సర్ప్రైజ్ కూడా ఉంది. ఏకంగా 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: 'నా కూతురిలో అమ్మను చూసుకున్నా'.. రాజేంద్రప్రసాద్‌ ఎమోషనల్ వీడియో

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe