Bigg Boss Promo: అయ్యాయో ఎంత పని చేశావ్ డెమోన్.. రీతూ గుండె పగిలింది!

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో డెమోన్ పవన్ రీతూ చౌదరికి షాకిచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా అతడికి నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం కల్పిస్తాడు బిగ్ బాస్.

New Update

Bigg Boss Promo: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో డెమోన్ పవన్ రీతూ చౌదరికి షాకిచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ఈ వారం కెప్టెన్ అయిన కారణంగా అతడికి నామినేషన్స్ నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం కల్పిస్తాడు బిగ్ బాస్. దీంతో హౌజ్ మేట్స్ తో పాటు చూసే ప్రేక్షకులు కూడా పవన్ రీతూనే సేవ్ చేస్తాడని భావించారు. కానీ, పవన్ చాలా తెలివిగా ఆడాడు. దమ్ము శ్రీజను నామినేషన్స్ నుంచి సేవ్ చేయాలనుకుంటున్నట్లు బిగ్ బాస్ కి చెప్పాడు. దీంతో మన రీతూ పాప గుండెపగిలింది. డెమోన్ డెసిషన్ వినగానే కన్నీళ్లతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. 

రీతూకి షాకిచ్చిన పవన్!

పోయిన వారమంతా  పవన్ కి సపోర్ట్ చేస్తూ.. దగ్గరుండి అతడిని  కెప్టెన్ చేసింది. ఇంటెన్షనల్ గా కాకపోయినా సంచలకుడిగా ఉన్న సమయంలో పవన్ పట్ల కాస్త ఫెవరేటిజం చూపించింది. తాను కోరుకున్నట్లుగా పవనే  కెప్టెన్ అయ్యేలా చేసింది. అంతేకాదు గతవారం వీరిద్దరి మధ్య ఒక చిన్న లవ్ ట్రాక్ కూడా చిగురించింది. దీంతో పవన్ తననే సేవ్ చేస్తాడని అనుకుంది రీతూ. కానీ డెమోన్ ఎవరూ ఊహించని విధంగా శ్రీజను సేవ్ చేసి రీతూ హార్ట్ బ్రేక్ చేశాడు. అయితే డెమోన్ ఇలా చేయడానికి ఒక కారణం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారం కెప్టెన్సీ టాస్క్ విషయంలో వీరిద్దరికి హోస్ట్  నాగార్జున బాగానే చివాట్లు పెట్టారు. అంతేకాకుండా ఈ మధ్య  వీళ్ళ కాస్త  క్లోజ్ గా ఉండడంతో వీరిద్దరి మధ్య సంథింగ్, సంథింగ్ నడుస్తుందని  హౌజ్ మేట్స్ తో పాటు ప్రేక్షకుల అభిప్రాయం. దీంతో రీతూ పట్ల తనకు ఎలాంటి ఫెవరేటిజం లేదని చెప్పడానికి పవన్ ఇలా చేసినట్లు నెటిజన్లు  అనుకుంటున్నారు. 

Bigg Boss Promo: బిగ్ బాస్ దెబ్బకు కామనర్స్ అంతా నామినేషన్స్ లో.. పవన్ కళ్యాణ్, శ్రీజకు చుక్కలు!

Advertisment
తాజా కథనాలు