Bigg Boss Promo: బిగ్ బాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నామినేషన్ ఎపిసోడ్ ప్రోమో వచ్చేసింది. ప్రోమో చూస్తుంటే.. నామినేషన్ గొడవలతో బిగ్ బాస్ హౌజ్ హీటెక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం నామినేషన్స్ లో వార్ వన్ సైడ్ అయిపోయినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ ట్విస్టుతో కామనర్స్ అంతా నామినేషన్స్ ఉన్నట్లు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. ముందుగా కామనర్స్ అందరు కలిసి సెలబ్రెటీల నుంచి ఐదుగురిని నామినేట్ చేయాలని తెలిపాడు బిగ్ బాస్. ఆ ఐదుగురిలో ఒకరు కామనర్ కూడా ఉండాలని రూల్ పెట్టారు. దీని ప్రకారం కామనర్స్ అంతా కలిసి ఒక ఏకాభిప్రాయంతో .. సుమన్ శెట్టి, సంజన, ఫ్లోరా, రీతూ, హరిత హరీష్ ని నామినేట్ చేశారు. క్కడ వరకు బాగానే ఉంది. దీని తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్. తాజా ప్రోమోలో సెలబ్రెటీలకు.. కామనర్స్ చేసిన నామినేషన్స్ ని స్వాప్ చేసే అధికారం కల్పించాడు.
#BiggBossTelugu9
— Ravi Teja Sunkari. (@saradagakasepu4) September 22, 2025
Like always #sanjanagalrani enjoying fights!😅
Thakita Thakita Godava Godava 🤣🤣💥💥🔥🔥#NagarjunaAkkineni#Biggboss9telugupic.twitter.com/bG5TKk72KK
పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇమ్మాన్యూయేల్
దీంతో ఇమ్మాన్యుయేల్ సంజన, సుమన్ శెట్టిని పవన్ కళ్యాణ్ తో స్వాప్ చేశాడు. అందరితో కలవడంలేదని, ఇంకా తన గేమ్ మొదలు పెట్టలేదని పవన్ కళ్యాణ్ ని నామినేట్ చేశాడు. దీంతో పవన్, ఇమ్మాన్యుయేల్ మధ్య పెద్ద ఆర్గుమెంట్ జరిగింది. ఆ తర్వాత రీతూ, సంజన వచ్చి.. శ్రీజను నామినేట్ చేశారు. దీంతో ఇక్కడ కూడా వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. అవసరమై చోటు కాకుండా అనవసరమైన విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతున్నావు అనే పాయింట్ తో శ్రీజను నామినేట్ చేసింది రీతూ. దానికి శ్రీజ రీతూ పై రెచ్చిపోయింది. అవును నాకు మాట్లాడాలనిపిస్తే మాట్లాడతాను అంటూ ఆర్గుమెంట్ మొదలు పెట్టింది.
మొత్తానికి రెండవ వారం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినెట్ అయ్యినట్లు తెలుస్తోంది. రాము రాతోడ్, హరిత హరీష్, కళ్యాణ్, రీతూ చౌదరీ, ప్రియా శెట్టి, ఫ్లోరా ఇంటి బయటకు వెళ్లేందుకు నామినెట్ అయ్యారు. ఫ్లోరా వరుసగా మూడవ వారంలో కూడా నామినేషన్స్ లో ఉండడం గమనర్హం. గత ఫ్లోరా హౌజ్ లో ఏం చేయకపోయినప్పటికీ సేవ్ అవుతూ వచ్చారు. మరి మూడవ వారం కూడా ఆమెకు అదే లక్కు కలిసోస్తుందా లేదా చూడాలి.
ఇద్దరు అవుట్
15 వారల బిగ్ బాస్ షోలో ఇప్పటికే రెండు వారాలు పూర్తయ్యాయి. ఈ రెండు వారాల్లో శ్రష్టి, మర్యాద మనీష్ బిగ్ బాస్ ఇంటి నుంచి ఎలిమినేటై బయటకు వెళ్లారు. కామనర్స్ నుంచి ఒకరు సెలబ్స్ నుంచి ఒకరు వెళ్లుపోయారు. కామనర్స్ క్యాటగిరీలో వచ్చిన మర్యాద చివరికి వరకు గట్టి పోటీ ఇస్తారని అందరూ భావించారు. అగ్నిపరీక్ష షోలో అతడి స్ట్రాట జీస్, థాట్ ప్రాసెస్ ఆడియన్స్ ని ఫిదా చేశాయి. కానీ బిగ్ బాస్ హౌజ్ లో అవే అతడి కొంప ముంచాయి. మరీ ప్రతీ చిన్న విషయానికి కూడా ఏదో ఏదో ఊహించుకొని ఓవర్ స్ట్రాటజీస్ వేయడం ఆడియన్స్ కి నచ్చలేదు. అందువల్లే అతడు అంత త్వరగా వెళ్లిపోవాల్సి వచ్చిందని నెటిజన్ల అభిప్రాయం.