/rtv/media/media_files/2025/02/06/QnH3wosne4BQvH9liJZe.jpg)
Ram Gopal Varma
Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదాలకు మారుపేరుగా నిలుస్తుంటారు. తరచూ ఏదో ఒక వివాదంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. కొన్నిసార్లు ఆయన వ్యాఖ్యలు కారణంగా వివాదాలు చెలరేగితే.. మరికొన్నిసార్లు ఆయన సినిమాలు వివాదాస్పదం అవుతుంటాయి. తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. రిటైర్డ్ ఏపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆర్జీవీ పై కేసు పెట్టారు. 2022లో ఆయన నిర్మించిన 'దహనం' వెబ్ సీరీస్ లో అనుమతి లేకుండా తన గుర్తింపును వాడారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజనా సిన్హా 1990 బ్యాచ్ కి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ అని తెలుస్తోంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఆమె దేశానికి సేవలందించినట్లు సమాచారం.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో చిక్కుకున్నారు ఈ వివాదాస్పద దర్శకుడు. రిటైర్డ్ ఏపీఎస్ అధికారిణి అంజనా సిన్హా ఆర్జీవీ పై క్రిమినల్ కేసు పెట్టారు. #ips#case#director#ramgopalvarma#dhahanam#webseriespic.twitter.com/vYJWIGFqrt
— Telugu Stride (@TeluguStride) September 16, 2025
దర్శకుడు ఆర్జీవీ పై కేసు
అయితే ఇటీవలే తన స్నేహితురాలి ద్వారా 'దహనం' వెబ్ సిరీస్ గురించి తెలుసుకున్న ఆమె.. సీరీస్ లో తన పేరును వృత్తిపరమైన గుర్తింపును తన అనుమతి లేకుండా వాడారని ఆరోపించారు. వాణిజ్యపరమైన లబ్ది కోసం తన పేరును దుర్వినియోగం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందులో అభ్యంతరకరమైన, హింసాత్మకమైన సన్నివేశాలు ఉన్నాయని.. అవి తన ప్రతిష్టకు, గౌరవానికి భంగం కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా తన పేరును, గుర్తింపును వాడడం ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని ఆరోపించారు. ఈ మేరకు రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేశారు. నిర్మాత ఆర్జీవీతో పాటు దర్శకుడి అగస్త్య మంజు పై పలు సెక్షన్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సంఘటనపై రామ్ గోపాల్ వర్మ ఇప్పటివరకు స్పందించలేదు. ఇదిలా ఉండగా, గతంలో కూడా ఆయనపై పలు సందర్భాల్లో కేసులు నమోదయ్యాయి. కాగా, ఇప్పుడీ సంఘటనతో మరో కొత్త వివాదంలో చిక్కుకున్నారు.