Bigg Boss: కామనర్స్ కి బిగ్ షాక్ మర్యాద మనీష్ ఎలిమినేటెడ్..! రాత్రి ఎపిసోడ్ లో ఊహించని ట్విస్ట్

బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈరోజు రాత్రి ఎపిసోడ్ తో రెండవ వారం బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పేదెవరో తేలిపోతుంది.

New Update

Bigg Boss:  బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసే ఎలిమినేషన్ ఎపిసోడ్ వచ్చేసింది. ఈరోజు రాత్రి ఎపిసోడ్ తో రెండవ వారం బిగ్ బాస్ ఇంటికి గుడ్ బై చెప్పేదెవరో తేలిపోతుంది. ఈ వారం ప్రియా, సుమన్ శెట్టి, భరణి, డెమోన్ పవన్, ఫ్లోరా, హరిత హరీష్ నామినేషన్ లో ఉన్నారు. అయితే సోషల్ మీడియాలో  వస్తున్న వార్తల ప్రకారం.. చాలా మంది ఊహించని కంటెస్ట్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఊహించని కంటెస్టెంట్ మరెవరో కాదు మన మర్యాద మనీష్! 

మనీష్ ఎలిమినేటెడ్ 

చివరిగా ప్రియా, మనీష్ ఇద్దరి మధ్య ఎలిమినేషన్ ప్రక్రియ జరగగా.. మర్యాద మనీష్ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. అందరూ ఈ వారం ఫ్లోరా ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు. కానీ, ఓవర్ స్ట్రాటజీస్, బేస్ లెస్ ఆర్గుమెంట్స్, డబుల్ స్టాండ్స్, ఏదీ లేకపోయినా.. అక్కడ ఏదో ఉందనుకొని ఓవర్ స్ట్రాటజీస్ వేయడమే అతడి కొంప ముంచిందని ప్రేక్షకుల అభిప్రాయం. హౌజ్ లో మనీష్ ఆటకన్నా ఇతర కంటెస్టెంట్స్ అనాలసిస్ ఇవ్వడమే, వాళ్ళ మనసులోకి దూరిపోయి వాళ్లేమనుకుంటున్నారో అంచనాలు వేయడమే పనిగా పెట్టుకున్నట్లు చూసేవారికి అనిపించింది. అందరికంటే స్మార్ట్ గా ఆడుతున్నాననే ఫీలింగ్ లో  మనీష్.. తనకు తెలియకుండానే తన ఆటను స్పాయిల్ చేసుకున్నాడని ప్రేక్షకుల ఫీలింగ్. 

Also Read: Priyanka Kumar: బీచ్‌లో నాజుకైన నడుము చూపిస్తూ ప్రియాంక అందాలు.. కుర్రాళ్లను పిచ్చెక్కిస్తున్న కన్నడ బ్యూటీ!

Advertisment
తాజా కథనాలు