/rtv/media/media_files/2025/12/18/rajasaab-songs-2025-12-18-15-13-42.jpg)
Rajasaab Songs
Rajasaab Songs: మ్యూజిక్ డైరెక్టర్ తమన్(Thaman) టాలంట్ మనందరికీ తెలుసు. కానీ, ఈ టాలంట్ కొన్ని సినిమాల్లోనే ఎక్కువగా కనబడుతోంది. ఈ ఏడాది “డాకూ మహారాజ్”, “OG” సినిమాల తప్ప, ఇతర ప్రాజెక్ట్‌లలో ఆయన సంగీతం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
అఖండ 2 వంటి పెద్ద సినిమాకు కూడా తమన్ సంగీతం అంతంత మాత్రంగానే వర్కౌట్ అవ్వడం నిజంగా ఆశ్చర్యకరం. తాజాగా విడుదలైన ప్రభాస్ “రాజాసాబ్” పాటలలో కూడా సంగీతం అనుకున్నంతగా ఆకట్టుకోవడంలేదనే టాక్ వస్తోంది.
అనేక మంది విమర్శకులు, తమన్ ప్రస్తుతం ఎక్కువ పనిలో మునిగిపోతున్నారని, కాబట్టి సంగీతం నాణ్యత తగ్గిపోతోందని చెబుతున్నారు. అలాగే, చిన్న, మధ్యస్థాయి సినిమాల కోసం ఫీజు లేకుండా మ్యూజిక్ అందించడం, ఆడియో హక్కులు విక్రయంపై ఎక్కువ ఫోకస్ చేయడం కూడా క్వాలిటీ తగ్గించే ప్రమాదం ఉంది. తమన్ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఆయన మ్యూజిక్ కు ఒక బ్రాండ్ వేల్యూ ఉంది. హిట్ సాంగ్స్ ఇవ్వకపోతే, ఆ బ్రాండ్ విలువ కూడా తగ్గిపోతుంది.
Also Read: న్యూ ఇయర్ రోజు కూడా వదిలిపెట్టను.. సందీప్ వంగా స్వీట్ వార్నింగ్..!
అయితే “రాజాసాబ్”లో ప్రస్తుతానికి రెండు పాటలు మాత్రమే రిలీజ్ అయ్యాయి ఇంకా మెయిన్ గా డాన్స్ నంబర్ రిలీజ్ కావాల్సి ఉంది! నిధి అగర్వాల్, రిధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుత ప్రమోషన్ దశలో ఉంది. ఇప్పటివరకు రెండు పాటలు రిలీజ్ అయ్యాయి, కానీ ప్రేక్షకులసు ఆకర్షించడంలో కొంత వెనకపడ్డాయి. పాటలు, లిరిక్స్, లిరికల్ వీడియోలు, వాటి వీడియో ఎడిటింగ్, ట్రాన్సిషన్స్ ఇవేవి కూడా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ కి గురవుతున్నాయి.
Also Read: పాపం నిధి.. ఊపిరాడకుండా నలిపేసిన ఫ్యాన్స్.. వీడియో వైరల్!
ఇప్పుడు అభిమానులు డాన్స్ నంబర్ పై ఆశలు పెట్టుకున్నారు. ఇందులో ప్రభాస్ తో పాటు మూడు హీరోయిన్లు ఉంటారు. ఈ డాన్స్ నంబర్ సినిమాకు పాజిటివ్ వైబ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. తమన్ ఆల్రెడీ ఆల్బమ్‌ను ప్రాజెక్ట్ డిలే కారణంగా రీవర్క్ చేశారని చెప్పారు, కానీ పాటలు వింటుంటే అదేమి అనిపించడం లేదు అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి, తమన్ సంగీతం మళ్ళీ మ్యాజిక్ చేయాలంటే, ఎక్కువ సినిమాలు కాకుండా, క్వాలిటీపై దృష్టి పెట్టి, ప్రాజెక్ట్‌లను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యంగా కనిపిస్తోంది.
Follow Us