Bigg Boss Promo: బ్లాక్ బాల్ తెచ్చిన పెంట.. తనూజ ఎలిమినేటెడ్! షాక్ లో భరణి !

బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ గోళ, టాస్కుల రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో పవన్ కళ్యాణ్, డెమోన్, తనూజ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు కనిపించింది. కెప్టెన్సీ కంటెండర్స్ ఎంపిక కోసం జరిగిన టాస్కులో భాగంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

New Update

Bigg Boss Promo: బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్సీ గోళ, టాస్కుల రచ్చ మొదలైంది. తాజాగా విడుదలైన ఈరోజు ఎపిసోడ్ ప్రోమోలో పవన్ కళ్యాణ్, డెమోన్, తనూజ మధ్య రచ్చ రచ్చ జరిగినట్లు కనిపించింది. కెప్టెన్సీ కంటెండర్స్ ఎంపిక కోసం జరిగిన టాస్కులో భాగంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ టాస్కులో మూడు టీమ్స్ గా విడిపోయిన కంటెస్టెంట్లు.. స్టార్ట్ బజార్ మోగగానే నెట్ లో ఉన్న వివిధ రంగుల బాల్స్ నుంచి బిగ్ బాస్ ఎంపిక చేసిన రంగు బాల్ ను బయటకు తీసి.. ఆ తర్వాత దానిని తమ టీమ్ బుట్టలో వేసుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్  తెలిపారు. ఇందులో భాగంగా మొదట బ్లూ కలర్ బాల్ ఎంపిక చేయగా.. ఇమ్మాన్యుయేల్ రెడ్ టీమ్ ఎక్కువ బాల్స్ ని తమ బుట్టలో వేసుకున్నట్లు కనిపించారు. ఈ క్రమంలో బాల్ కోసం తనూజ - కళ్యాణ్ మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. ''బాల్ ని దక్కించుకునే క్రమంలో కొడుతున్నారు'' అంటూ కళ్యాణ్ పై మాటల యుద్దానికి దిగింది తనూజ. దీంతో ఇమ్మాన్యుయేల్ అనుకోకుండా తగిలి ఉండొచ్చులే అనగా.. దానికి తనూజ.. ''లేదు కావాలనే కొట్టినట్లు ఉంది'' అంటూ వాదించడం మొదలు పెట్టింది . 

Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!

తనూజ ఎలిమినేటెడ్ 

సెకండ్ రౌండ్ లో బిగ్ బాస్ ఎల్లో కలర్ బాల్ ఎంపిక చేయగా.. నెట్ నుంచి బ్లాక్ కలర్ బాల్ బయటకు వేశారు కంటెస్టెంట్స్. దీంతో బిగ్ బాస్..  ''బ్లాక్ కలర్ బాల్ ఎవరి వల్ల బయటకు వచ్చిందో.. వాళ్ళు ఈ రౌండ్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని తెలిపాడు. కెప్టెన్ డెమోన్ పవన్ ని ఆ బాల్ బయటపడేసిందెవరో తెలియజేయాలని చెప్పాడు. దీంతో డెమోన్.. తనూజ కారణంగా ఆ బాల్ బయటకు వచ్చింది.. సో తనూజ ఈ రౌండ్ నుంచి ఎలిమినేటెడ్ బిగ్ బాస్ అని చెప్పాడు.  ఈ విషయంలో డెమోన్ పవన్- పవన్ కళ్యాణ్ మధ్య చిన్న వాగ్వాదం కూడా జరిగినట్లు ప్రోమోలో చూపించారు. ''తనూజ టీమ్ లీడర్ ఆమెను ఎలా ఎలిమినేట్ చేస్తారు.. ఆమె టీమ్ లోని సపోర్టర్స్ ని తీసేయాలని'' కళ్యాణ్ వాదించాడు.  మరి తనూజ రౌండ్ నుంచి ఎలిమినేట్ అయ్యిందా.. లేదా డెమోన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నాడా? తెలియాలంటే నైట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. 

Also Read: Bigg Boss Telugu Promo: గేమ్ ఛేంజర్ పవన్.. సుమన్ శెట్టి VS రీతూ నామినేషన్స్ లో రచ్చ రంబోలా!

Advertisment
తాజా కథనాలు