/rtv/media/media_files/2025/09/28/bigg-boss-9-telugu-priya-shetty-2025-09-28-20-35-14.jpg)
Bigg Boss 9 Telugu Priya Shetty
Bigg Boss 9 Elemination: బిగ్‌బాస్ 9 తెలుగు సీజన్ ఇప్పటివరకు మూడు వారాలు పూర్తిచేసుకుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ రియాలిటీ షోలో ఇప్పటికీ బోలెడన్ని ట్విస్ట్‌లు, ఎలిమినేషన్స్ నడుస్తున్నాయి. ఈ వారానికి సంబంధించి ఎలిమినేషన్ రౌండ్‌లో ప్రియా శెట్టి(Priya Shetty), ఫ్లోరా సైని ఇద్దరూ డేంజర్ జోన్‌లో ఉన్నారని ఇప్పటికే ఊహాగానాలు వచ్చాయి.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఈవారం ప్రియా శెట్టి ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమెకు తక్కువ ఓట్లు వచ్చాయని, అందువల్లే ఆమె ఈవారం హౌస్ నుంచి వెళ్లిపోతున్నారని సమాచారం.
ప్రియా శెట్టి ఒక కామన్ కంటెస్టెంట్‌గా, "అగ్నిపరిక్ష" షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలోనే ఆమెపై మంచి అంచనాలు ఉన్నాయి. డాక్టర్‌గా ఉన్న ఆమె, సింపుల్ గేమ్ ప్లే చేసినా, ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో కొంత వెనకపడిందని అంటున్నారు.
Also Read: ‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ ఎలిమినేషన్ తర్వాత ప్రియా హౌస్‌ను వదిలి బయటకు వస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఈ నిర్ణయంపై వారి వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫ్లోరా సైని మాత్రం తక్కువ ఓట్లతో ఉన్నా, ఈసారి ఎలిమినేషన్ నుండి తప్పించుకున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఈవారం బిగ్‌బాస్ హౌస్‌లో మరో కామన్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయారు. రాబోయే రోజుల్లో ఇంకా ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి.
Follow Us