Bigg Boss promo: వెక్కి వెక్కి ఏడ్చిన దివ్వెల మాధురి.. వంటింట్లో పవన్ కళ్యాణ్ పై రెచ్చిపోయి.. రచ్చ రచ్చ!

బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ స్ట్రామ్ ఎఫెక్ట్ మొదలైంది. తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఫుల్ వైల్డ్ గా కనిపించింది. కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయింది.

New Update

Bigg Boss promo: బిగ్ బాస్ సీజన్ 9 లో వైల్డ్ స్ట్రామ్ ఎఫెక్ట్ మొదలైంది. తాజాగా విడుదలైన లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ దివ్వెల మాధురి ఫుల్ వైల్డ్ గా కనిపించింది. కెప్టెన్ పవన్ కళ్యాణ్ తో దురుసుగా ప్రవర్తిస్తూ రెచ్చిపోయింది. వంట విషయంలో ఫుడ్ మానిటర్ దివ్య, కెప్టెన్ పవన్ కళ్యాణ్, దివ్వెల మధ్య పెద్ద గొడవ జరిగింది. మాధురి కుకింగ్ డ్యూటీకి ఆలస్యంగా రావడంతో కళ్యాణ్, దివ్య ఆమె పక్కకు పిలిచి చెప్పడానికి ట్రై చేశారు. కళ్యాణ్ చాలా  మర్యాదగా మాధురిని.. ''కూర్చోండి మేడం మాట్లాడాలి'' అని అడిగాడు. కానీ, మాధురి మాత్రం.. ''ఏ కూర్చోకపోతే చెప్పవా'' అంటూ కళ్యాణ్ తో దురుసుగా ప్రవర్తించింది. దీంతో కళ్యాణ్ కూడా రెచ్చిపోయాడు! మీరు ఇలా మాట్లాడితే..నేను ఇంకోలా మాట్లాడాల్సి ఉంటుంది అని మాధురికి కౌంటర్ ఇచ్చాడు. 

వెక్కి వెక్కి ఏడ్చిన మాధురి 

ఇంతటితో గొడవ ఆగలేదు మళ్ళీ  వంటింట్లో ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. ''నేను మర్యాదగా కూర్చుడి అంటే.. కూర్చోకపోతే చెప్పవా అనడం వెటకారమే'' అంటూ వాదించాడు కళ్యాణ్. దీంతో మాధురి ''ఏంటీ వాయిస్ రేజ్ చేస్తున్నావ్'' అని కళ్యాణ్ పై ఫుల్ ఫైర్ అయ్యింది. ఈ గొడవలో దివ్య.. కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలిచింది. ''మీరు కుకింగ్ చేయడానికి ఇంత ఆలస్యంగా వస్తే.. ఇంట్లో అందరు పస్తులుండాలా'' అంటూ మాధురిపై విరుచుకుపడింది. వచ్చిన మొదటి రోజే ఇంత పెద్ద గొడవ జరగడంతో మాధురి కాస్త ఎమోషనల్ అయినట్లు ప్రోమోలో కనిపించింది. ఇంటిని, కుటుంబ సభ్యులను గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకుంది. తనూజ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేసింది. 

Also Read: CINEMA: ఓటీటీలోకి జాన్వీ కపూర్ రొమాంటిక్ మూవీ.. కానీ చూడాలంటే ఒక కండీషన్

Advertisment
తాజా కథనాలు