BIGG BOSS PROMO: బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ముందు ఫన్నీ ఫన్నీగా సాగిన చివరికి వచ్చేసరికి ఫుల్ హీటెక్కింది. సెలబ్రెటీ కంటెస్టెంట్ భరణి - మాస్క్ మ్యాన్ మధ్య పెద్ద గొడవ జరిగింది. అయితే సంజన కారణంగా ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. సంజన ఓనర్స్ అయిన కామనర్స్ పర్మిషన్ లేకుండా ఒక గుడ్డు దొంగతనం చేసింది. ఇది గుర్తించిన కామనర్స్ గుడ్డు ఎవరు దొంగతనం చేశారు అంటూ అందరినీ అడిగారు. కానీ, సెలబ్రెటీ కంటెస్టెంట్స్ ఎవరూ కూడా గుడ్డు ఎవరు తీశారో చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన ఇంటి ఓనర్స్ ఇకపై టెనెంట్స్ కి హౌజ్ లోకి పర్మిషన్ లేదని చెప్పారు.
వేడెక్కిన బిగ్ బాస్ హౌజ్
ఇక్కడే అసలు గొడవ మొదలైంది. గుడ్డు దొంగతనం చేసింది సంజన అని తెలుసుకున్న భరణి ఆమెతో వాదించడం మొదలు పెట్టాడు. మీ ఒక్కరి కారణంగా మిగతా కంటెస్టెంట్స్ అందరికీ ఇంట్లోకి వెళ్లే పర్మిషన్ లేకుండా పోతుంది అని ఫైర్ అయ్యాడు. ఇంతలో భరణి ఆర్గుమెంట్ లోకి మాస్క్ మ్యాన్ వచ్చి దూరాడు. దీంతో మాస్క్ మ్యాన్ వర్సెస్ భరణి గా గొడవ చెలరేగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు గట్టిగా అరుచుకున్నారు. హౌజ్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కూల్ గా కనిపించిన భరణి ఈరోజు విశ్వరూపం చూపించారు. ఒక్కసారిగా హౌజ్ అంతా వేడెక్కింది. మరి ఈ గొడవలో తప్పెవరిదో తెలియాలంటే ఎపిసోడ్ పూర్తిగా చూడాల్సిందే!
Bigg boss 1st week nomination list
— BIGGBOSS 9 TELUGU (@DreamSt63689777) September 9, 2025
1. Sanjana galrani
2. Rithu Chowdary
3. Tanuja
4. Immanuel
5. 5. Shrasty varma
6. Flora shaini
7. Ramu rathod
8.suman shetty
9. Demon pavan pic.twitter.com/p32w11xFnt
ఇదిలా ఉంటే ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. నిన్నటి ఎపిసోడ్ లో కామనర్స్ అంతా కలిసి ఏకాభిప్రాయంతో సంజనను నామినేట్ చేయగా.. ఆ తర్వాత జరిగిన నామినేషన్ ప్రక్రియ ద్వారా సుమన్ శెట్టి, రీతూ చౌదరీ, ఇమ్మాన్యుయేల్, తనూజ, శ్రేష్టి వర్మ, రాము రాథోడ్, డిమోన్ పవన్, ఫ్లోరా షైనీ నామినేషన్ లో ఉన్నారు. మొత్తం 9 మంది నామినేషన్ లో ఉండగా.. అందులో డెమోన్ పవన్ మాత్రమే కామనర్స్ నుంచి నామినేట్ అయ్యాడు. మిగతా వాళ్లంతా సెలబ్రెటీ కంటెస్టెంట్స్! అయితే వీరిలో సంజన, సుమన్ శెట్టి లేదా ఫ్లోరా ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సంజన విషయానికి వస్తే.. ఆమె కొన్ని సార్లు అవసరం లేకపోయిన గొడవ పెద్దది చేస్తూ ఇరిటేట్ చేస్తున్నట్లు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక సుమన్ శెట్టి, ఫ్లోరా విషయానికి వస్తే వీళ్ళు హౌజ్ ఉన్నారా? లేరా అన్నట్లుగా ఉంది. ఫ్లోరా అయినా అప్పడప్పుడు కనిపిస్తుంది. కానీ, సుమన్ మాత్రం ఇంకా తన గేమ్ మొదలు పెట్టలేదు. ఎక్కడా కూడా యాక్టీవ్ గా కనిపించడం లేదు. దీంతో ఫస్ట్ వీక్ అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని జనాల అభిప్రాయం.