/rtv/media/media_files/2025/10/28/sreeja-bharani-re-entry-2025-10-28-17-29-43.jpg)
Sreeja - Bharani re- entry
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 కొత్త కొత్త మలుపులు, ట్విస్టులతో ఆసక్తికరంగా సాగుతోంది. ఈ వారం ఎలిమినేటైన ఎక్స్ కంటెస్టెంట్స్ మళ్ళీ.. హౌజ్ లోకి రావడం, నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడంతో ఆట రసవత్తరంగా మారింది. ప్రియా, శ్రీజ, మర్యాద మనీష్, ఫ్లోరా తమ నామినేషన్స్ తో హౌజ్ మేట్స్ ను అల్లాడించారు. వీళ్ళ ఎంట్రీతో షో ఒక్కసారిగా వేడెక్కింది. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన ప్రోమోలో మరో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్ బాస్.
మళ్ళీ మాధురితో రచ్చ
దమ్ము శ్రీజ, భరణి రీ- ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలిపారు. అయితే వీరిద్దరిలో ఒకరికి మాత్రమే మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం కల్పించారు. శ్రీజ- భరణిలో ఎవరు మళ్ళీ హౌజ్ లో అడుగుపెట్టాలి అనేది మొగతా కంటెస్టెంట్స్ పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. దీనికోసం కంటెస్టెంట్లు ఒకరి తర్వాత ఒకరు వచ్చి.. అక్కడున్న ప్లకార్డు పై ఆ ఇద్దరు మార్చుకోవాల్సిన విషయాల గురించి చెప్పాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో దమ్ము శ్రీజ- దివ్వెల మాధురి మధ్య మరోసారి హీటెడ్ ఆర్గుమెంట్ జరిగింది. మాధురి ''శ్రీజకు మైండ్ యువర్ వర్డ్స్'' అనే సలహా ఇచ్చారు. శ్రీజ నోటికి ఏమొస్తే అది మాట్లాడుతుంది.. కొంచెం అది మార్చుకుంటే బాగుంటుంది అంటూ శ్రీజ పై హాట్ కామెంట్స్ చేసింది మాధురి. దీంతో శ్రీజ కూడా రెచ్చిపోయింది! మీరు మాట్లాడే విధంగా అయితే నేను ఎప్పుడు మాట్లాడలేదు! నాకలా రాదు కూడా అంటూ కౌంటర్ ఇచ్చింది.
Also Read: The Family Man 3: 'ది ఫ్యామిలీ మ్యాన్' మళ్ళీ వచ్చేస్తున్నాడు.. సీజన్ 3 లో సామ్ రోల్ ఇదేనా
Follow Us