Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ వీకెండ్ ప్రోమో వచ్చేసింది. ఇందులో కంటెస్టెంట్స్ అంతా రెండు టీమ్స్ గా విడిపోయి 'థమ్స్ అప్ విత్ బిర్యానీ' బ్రాండ్ ప్రమోషన్ టాస్కులో పాల్గొన్నారు. ఇరు టీమ్ సభ్యుల నుంచి డెమోన్ పవన్, దివ్వెల మాధురి ఈ టాస్క్ లో పాల్గొన్నారు. బజర్ మోగేలోపు.. బిర్యానీకి కావాల్సిన వస్తువులను ఏ టీమ్ సభ్యులు ఎక్కువగా సేకరిస్తారో వారు టాస్క్ విజేతలుగా నిలిచి 'థమ్స్ అప్ విత్ బిర్యానీ' ఎంజాయ్ చేయవచ్చని బిగ్ బాస్ తెలిపారు. అనంతరం డెమోన్ పవన్- మాధురి ఇద్దరూ టాస్క్ ఆడగా.. డెమోన్ పవన్ విజేతగా నిలిచాడు. దీంతో డెమోన్ పవన్ అండ్ టీమ్ కి 'థమ్స్ అప్ విత్ బిర్యానీ' ఎంజాయ్ చేసే అవకాశం దక్కింది.
దివ్వెల మాధురి వర్సెస్ భరణి..
అయితే ఈ టాస్కులో భాగంగా భరణి- దివ్వెల మాధురి మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. దివ్వెల మాధురి బిర్యానీ పెట్టుకుంటుండగా.. భరణి ఆమెను ఆపేశాడు. ముందుగా గెలిచిన టీమ్ వాళ్ళకి పెట్టిన తర్వాత మీకు వడ్డిస్తాను అని చెప్పాడు. దీంతో దివ్వెల మాధురి కాస్త హార్ట్ అయ్యింది. ఆ తర్వాత భరణి ఆమెను పిలిచినప్పటికీ.. తినడానికి రాలేదు. తినేముందు అలా చెబితే.. ఎవరికైనా బాధగా ఉంటుంది అంటూ మాట్లాడింది. దీంతో భరణి.. నేను నార్మల్ గా చెప్పాను.. మీరు ప్రతిదానికి ఫీల్ అవుతే ఏం చేయలేమని మాధురికి బదులిచ్చాడు. ఇలా ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. ఇంతలో దివ్య వచ్చి మధ్యలో దూరింది. భరణికి సపోర్ట్ గా మాధురితో వాదనకు దిగింది.
Follow Us