Bigboss 9 Winner: కప్ కొట్టేసిన ఆర్మీ మ్యాన్.. బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల

బిగ్‌బాస్ సీజన్-9 విన్నర్‌గా కళ్యాణ్ పడాల నిలిచినట్లు సమాచారం. 105 రోజుల పాటు ఆడియన్స్‌ని అలరించిన ఈ సీజన్‌లో తనూజ-కళ్యాణ్ మధ్య చాలా ఉత్కంఠగా పోటీ నడిచింది.

New Update
kalyan

బిగ్‌బాస్ సీజన్-9 విన్నర్ ఎవరూ ఎవరూఅనిఆడియన్స్‌ చూసిన ఎదురుచూపులకి తెరపడింది. ఈ సీజన్-9 విన్నర్‌గా కామనర్ కళ్యాణ్ పడాల నిలిచాడు. చివరి వరకూ నెక్ అండ్ నెక్‌గా తనూజ-కళ్యాణ్ మధ్య పోటీ నడిచింది. కానీ ఎట్టకేలకి చాలా చిన్న తేడాతో కళ్యాణ్ విన్నర్ అయ్యాడు. ఇర తనూజ రన్నరప్ గా నిలిచింది.

మొదట మూడు వారాలు కల్యాణ్ అంటే పెద్దగా ఎవరికీ తెలియదు. కామనర్ గా వచ్చాడు, ఆర్మీ మ్యాన్ అని తప్ప అతని గురించి పెద్దగా హోప్ లేదు. కానీ మూడో వారంలో ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం కళ్యాణ్ అసలు ఆట మొదలైంది. ఆ వారం నుంచి వరుసగా ప్రతి వీక్‌ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతూనే వచ్చింది. చివరికి ఫ్యామిలీ వీక్ టైమ్‌కి కళ్యాణ్ విన్నర్ రేసులోకి వచ్చేశాడు. అదే ఊపులో చివరి కెప్టెన్‌గా, ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి రికార్డ్ కొట్టాడు. ఇప్పుడు బిగ్‌బాస్ 9 విన్నర్ అయి ఆడియన్స్ చేత జై జవాన్ అనిపించుకున్నాడు.

సీఆర్పీఎఫ్ నుంచి బిగ్ బాస్ వరకు..

బిగ్ బాస్ 9 కోసం ఎప్పుడూ లేనట్టుగా ఈసారి కామనర్ల కోసం అగ్ని పరీక్ష అని ఒక షో కండక్ట్ చేశారు. దాని కోసం వచ్చిన వేలాది అప్లికేషన్ల నుంచి ఫిల్టర్ చేసి 15 మందితో షో నిర్వహించారు. అలా అగ్నిపరీక్షలో నిలిచిన వారిలో కల్యాణ్ ఒకడు. సీఆర్పీఎఫ్ జవాన్ అయిన కళ్యాణ్‌కి చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి కారణంగా వచ్చిన అవకాశాన్ని కాదనలేక సీఆర్పీఎఫ్‌లో చేరాడు. అయితే అగ్నిపరీక్ష గురించి తెలిసి అప్లై చేసి మొత్తానికి సెలక్ట్ అయి హౌస్‌లోకి అగుపెట్టాడు.

Advertisment
తాజా కథనాలు