Jani Master : అత్యాచారం కేసులో జానీ మాస్టర్‌కు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో వాస్తవాలు బయటకు తెచ్చేందుకు జానీ మాస్టర్ ను తమ కస్టడీకి ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈరోజు పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ పై విచారించిన ధర్మాసనం జానీ మాస్టర్ ను విచారించేందుకు నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కాగా ఇటీవల ఉప్పరపల్లి కోర్టు జానీ మాస్టర్ కు 10 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. కాగా కోర్టు ఇచ్చిన ఆదేశాలతో ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న జానీ మాస్టర్ ను తమ కస్టడీలోకి తీసుకోనున్నారు పోలీసులు. ఈరోజు కస్టడీ తీసుకొని నాలుగు రోజుల పాటు జానీని విచారించనున్నారు.
Also Read : ఏపీలో హైడ్రా.. బందరులో 180 నిర్మాణాలు నేలమట్టం!
నేరం ఒప్పుకున్నాడు: పోలీసులు
జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు బయట కు వచ్చాయి. జానీ మాస్టర్ నేరాన్ని అంగీకరించారని పోలీసుల రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. 2019లోనే బాధితురాలతో తనకు పరిచయం ఉందని జానీ మాస్టర్ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్ లో ఇలా... దురుద్దేశంతోనే బాధితురాలిని అసిస్టెంట్‌గా చేర్చుకున్నారు. 2020 జనవరి 20న ముంబైలోని హోటల్‌లో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నాలుగేళ్లుగా బాధితురాలిపై లైంగిక దాడి కొనసాగింది. విషయం బయటకు రావద్దని బాధితురాలికి బెదిరింపులు చేశాడు.
సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులు చేసినట్లు ఒప్పుకున్నాడు. షూటింగ్‌ల పేరుతో వివిధ ప్రాంతాలకు తీసుకెళ్లి హోటల్స్‌లో లైంగిక దాడి చేసినట్లు పోలీసులకు వాగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తోంది. తొలిసారి జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినప్పుడు బాధితురాలి వయస్సు 16 ఏళ్లు. కాగా బాధితురాలు మైనర్ గా ఉన్నప్పుడు అత్యాచారం చేసినందుకు జానీ మాస్టర్ పై ఇప్పటికే పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే.. జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది వేచి చూడాలి.
Also Read : ఎన్టీఆర్ 'దేవర' సినిమాకు ఏపీ హైకోర్టు షాక్..!
Also Read : ఆఫీస్ వర్క్ టార్చర్‌కు మరో యువతి బలి..? ఇంకెన్ని ఘోరాలు చూడాలో!
Also Read : ఏపీలో తొలి వందే మెట్రో...ఏ రూట్లో పరుగులు పెడుతుందంటే!