BIG BREAKING : అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్

అల్లు అర్జున్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి వచ్చే నెల 6వ తేదీన ఉత్తర్వులు ఇస్తామని, అప్పటి దాకా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

author-image
By Anil Kumar
New Update
hfghfh

ఇటీవల ఏపీ ఎలక్షన్స్ టైం లో టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్.. వైసీపీ నేత రవిచంద్ర కిషోర్ తరపున నంద్యాలలో ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో బన్నీ నిబంధనలు ఉల్లంఘించారని పోలీసులు కేసు నమోదు చేశారు. 

దీంతో అల్లు అర్జున్ దీనిపై హైకోర్టులో పిటిషన్ వేయగా.. విచారణ చేపట్టిన హైకోర్టు నేడు తీర్పును వెల్లడించింది. అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు పెట్టిన కేసుకు సంబంధించి వచ్చే నెల 6 న ఉత్తర్వులు ఇస్తామని, అప్పటిదాకా ఆయనపై చర్యలు తోసుకోవద్దని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అల్లు అర్జున్ కు ఈ కేసులో భారీ ఊరట లభించినట్లయ్యింది.

Advertisment
తాజా కథనాలు