/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-one-2025-08-17-19-50-58.png)
మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ 'స్టాలిన్' చిత్రాన్ని రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-two-2025-08-17-19-50-58.png)
దాదాపు 18 ఏళ్ళ తర్వాత ఈ చిత్రం మరోసారి థియేటర్స్ సందడి చేసేందుకు సిద్దమవుతోంది. ఈ నెల 22న ఎంపిక చేసిన పలు థియేటర్స్ లో రీ రిలీజ్ కానుంది.
/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-three-2025-08-17-19-50-58.png)
రీ రిలీజ్ ఇంకా ఐదు రోజులు మాత్రమే ఉండడంతో.. మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి మొదలు పెట్టారు. స్టాలిన్ సినిమాకు సంబంధించిన వీడియోలు, పోస్టర్లు షేర్ చేస్తూ హంగామా చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-four-2025-08-17-19-50-58.png)
అయితే ఈ సారి మెరుగైన దృశ్య అనుభవం కోసం సినిమాను 8k వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-five-2025-08-17-19-50-58.png)
ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2006 లో విడుదలైంది.
/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-six-2025-08-17-19-50-58.png)
ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్ గా నటించగా, ఖుష్బూ చిరంజీవికి అక్కగా నటించారు. ప్రకాష్ రాజ్ విలన్ పాత్రలో నటించారు.
/rtv/media/media_files/2025/08/17/stalin-re-release-pic-seven-2025-08-17-19-50-58.png)
సమాజంలో మంచి పనులు చేసేటప్పుడు, సహాయం పొందిన వారు కృతజ్ఞతలు చెప్పడానికి బదులుగా.. అదే మంచి పనిని మరో ముగ్గురికి చేసి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి సహాయం చేయాలి' అనే సందేశం ఈ సినిమాలో చూపించారు.