Balakrishna Mass Speech: 'జాజికాయ' ఈవెంట్‌లో బాలయ్య పవర్‌ఫుల్ స్పీచ్.. గూస్‌బంప్సే

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాలతో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ ‘జాజికాయ జాజికాయ’ రిలీజ్ వేడుక విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది.

New Update
balakrishna mass speech Akhanda 2 Thaandavam

balakrishna mass speech

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో ‘అఖండ 2: తాండవం’ భారీ అంచనాలతో రూపొందుతోంది. తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ సాంగ్‌ ‘జాజికాయ జాజికాయ’ రిలీజ్ వేడుక విశాఖపట్నంలోని జగదాంబ థియేటర్‌లో అభిమానుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. మాస్ స్టెప్పులు, హుషారైన బీట్‌తో అదరగొట్టిన ఈ సాంగ్‌ను రిలీజ్ చేసిన అనంతరం బాలకృష్ణ మాట్లాడిన మాటలు అభిమానుల్లో మరింత జోష్ నింపాయి. 

Jajikaya Jajikaya song event

‘ఇంట గెలిచి.. అక్కడ రచ్చ చేశాం’ అంటూ బాలయ్య తన ప్రసంగాన్ని ప్రారంభించారు. మొన్నటివరకు ‘అఖండ 2’ టైటిల్ సాంగ్ ‘తాండవం’ను ముంబైలో విడుదల చేసి.. తెలుగు సినిమా సత్తాని అక్కడ చూపించామన్నారు. ఇప్పుడు మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే ‘జాజికాయ’ సాంగ్‌ను మన సొంత ప్రాంతమైన విశాఖ వేదికగా విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. 

సినిమా హిట్టా? ఫట్టా? అని చూడకుండా.. తన మీద, తన సినిమా మీద ప్రేమతో, ఇంత దూరం వచ్చిన తన అభిమానులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అభిమానుల ప్రేమే తన బలం.. వారి అభిమానమే తన బలగం అని బాలకృష్ణ మాస్ స్పీచ్ ఇచ్చారు. 

ఇక బోయపాటితో తన కాంబినేషన్ అంటేనే ఒక వైబ్రేషన్ అని.. వారిద్దరూ కలిసి పనిచేసిన ప్రతిసారీ బాక్సాఫీస్ దద్దరిల్లిందని అన్నారు. ‘అఖండ 2’ కూడా అంతకు మించి ఉంటుందన్నారు. ఇందులో అఘోరా పాత్ర ఒక ఎత్తు అయితే మురళీకృష్ణ పాత్ర మరో ఎత్తని తెలిపారు. ఈ రెండు పాత్రలూ ప్రేక్షకులను థియేటర్‌లో కుర్చీలో కూర్చోనివ్వవన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ వేరే లెవెల్ అంటూ తెగ పొగిడేశారు. 

అతను మాస్ బీట్ కొడితే థియేటర్లు ఊగిపోవాల్సిందేనని అన్నారు. ఈ ‘జాజికాయ’ పాట వింటేనే ఫ్యాన్స్‌కి పూనకాలు వస్తున్నాయంటే.. తెరపై చూస్తే ఇక చెప్పాల్సిన అవసరం లేదని మరింత ఉత్సాహాన్నిచ్చారు. 

Advertisment
తాజా కథనాలు