/rtv/media/media_files/2025/08/24/balakrishna-2025-08-24-16-03-31.jpg)
balakrishna
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు మరో అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో (WBR) ఆయన పేరు చేరింది. 50 ఏళ్లగా ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న బాలయ్య సినీ ప్రస్థానానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. ఇండియన్ ఇండస్ట్రీలో ఈ అవార్డుకు ఎంపికైన తొలి నటుడిగా బాలయ్య చరిత్ర సృష్టించారు. ఆగస్టు 30న హైదరాబాద్‌లో బాలకృష్ణను WBR అధికారికంగా సత్కరించనుంది.
ఇదిలా ఉంటే రీసెంట్ గా బాలయ్యకు పద్మ భూషణ్ అవార్డు వరించింది. సినిమా, సామాజిక రంగంలో బాలయ్య సేవలకు, కృషిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది. దీంతో పాటు బాలయ్య నటించిన 'భగవంత్ కేసరి' సినిమాకు ఉత్తమ చిత్రం కేటగిరీలో నేషనల్ అవార్డు లభించింది. ఇలా బాలయ్యకు వరుస అవార్డులు, గౌరవ పురస్కారాలు రావడం పై నందమూరి కుటుంబం, నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బాలయ్యకు శుభాకంక్షాలు తెలియజేస్తున్నారు.
A huge congratulations to my father, Nandamuri Balakrishna Garu! 50 years as a leading hero, a feat now in the World Book of Records! You are a true force of nature, an icon on screen, and a compassionate leader off it. So proud of this global recognition for your incredible… pic.twitter.com/zfK8qWDoBF
— Brahmani Nara (@brahmaninara) August 24, 2025
తండ్రి వారసత్వం..
దివంగత నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకున్న బాలయ్య.. తనదైన శైలి నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అనేక విభిన్నమైన పాత్రల్లో నటించి విజయం బహుముఖ ప్రజ్ఞాశాలి అనిపించుకున్నారు. ఏళ్ళు గడిచినా అభిమానుల్లో ఆయన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈవెంట్, సినిమాతో సంబంధం లేకుండా జై బాలయ్య అంటూ నినాదాలు చేస్తారు ఫ్యాన్స్. ఆ రేంజ్ లో బాలయ్య క్రేజ్ ఉంది. బాక్సాఫీస్ వద్ద ఎన్నో సూపర్ హిట్ సినిమాలతో రికార్డులు సృష్టించారు. భారతీయ సినీ పరిశ్రమలో ఒక అరుదైన నటుడిగా నిలిచిపోయారు.
సేవా కార్యక్రమాలతో
సినిమా రంగంలోనే కాకుండా, సమాజానికి కూడా బాలయ్య తన సేవలను అందించారు. హిందూపూర్ ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలిచి, ఆ ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అలాగే, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఆయన అందిస్తున్న మానవతా సేవలు ఈ పురస్కారాలకు కారణం.
ఇదిలా ఉంటే.. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమతో బిజీగా ఉన్నారు. బోయపాటి - బాలయ్య కాంబోలో వస్తున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే టీజర్ విడుదలవగా.. బాలయ్య యాక్షన్, డైలాగ్స్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చాయి.