/rtv/media/media_files/2025/11/21/akhanda-2-trailer-2025-11-21-20-48-48.jpg)
Akhanda 2 Trailer
Akhanda 2 Trailer: నందమూరి బాలకృష్ణ(Balakrishna) హీరోగా, బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2’ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా డిసెంబర్ 5న విడుదల అవ్వబోతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో భారీగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. అనంతరం ట్రైలర్‌ను సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తే, ఈసారి కూడా బోయపాటి-బాలయ్య కాంబినేషన్ పవర్‌ఫుల్‌గా తిరిగి వస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఇందులో సనాతన ధర్మం ప్రధానంగా చూపించబోతున్నారని అర్ధమవుతోంది. బాలయ్య చెప్పిన డైలాగులు ట్రైలర్‌కే హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా,
“ఇప్పటి వరకూ మా దేశ రూపాన్ని మాత్రమే చూసుంటావ్… మా దేశ విశ్వరూపాన్ని చూడలేదు” అనే డైలాగ్ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.
అదే విధంగా యాక్షన్ సీక్వెన్సులు, అఖండ పాత్రలో బాలకృష్ణ గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్, బలమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్- ఇవన్నీ ట్రైలర్‌కి బలాన్నిచ్చాయి. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్ కూడా చాలా గొప్పగా ఉన్నాయి.
మొత్తానికి, ట్రైలర్ రిలీజ్‌తో ‘అఖండ 2’ పై హైప్ మరింత పెరిగింది. బాలయ్య-బోయపాటి కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడానికి రెడీగా ఉన్నట్లు కనిపిస్తోంది.
Follow Us