Balagam Venu: 'బలగం' తర్వాత వేణుకు ఎదురుదెబ్బ.. దిల్ రాజు ప్రాజెక్టుకు హీరో కరువయ్యాడు!

'బలగం' సినిమాతో రికార్డులు కొల్లగొట్టిన వేణుకి.. ఇప్పుడు తన తదుపరి సినిమా కోసం హీరో దొరకక ఇబ్బందులు పడుతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.

New Update
balagam venu

balagam venu

Balagam  Venu: వేణు యెల్దండి.. 'బలగం'  సినిమాతో ఈ పేరు ఇండస్ట్రీలో మారుమోగింది.  మానవ సంబంధాలు, తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాల నేపథ్యంలో వేణు  రూపొందించిన  ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో ఈ సినిమాకు రివార్డులు, అవార్డులు లభించాయి. ఒక కమెడియన్ గా కెరీర్ మొదలు పెట్టిన వేణు దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే ఇంతటి విజయాన్ని సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వేణు వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతారని అంతా అనుకున్నారు. 

'ఎల్లమ్మ' కు తప్పని కష్టాలు 

కానీ, ఊహించని విధంగా వేణు  తన  నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరో దొరకక ఇబ్బందులు పడుతున్నారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వేణు  'బలగం'  తర్వాత  దిల్ రాజుతో కలిసి  'ఎల్లమ్మ ' సినిమా అనౌన్స్  చేయగా.. ఇది ఇంకా చర్చల దశలోనే ఉంది.  సినిమా అనౌన్స్ చేసి ఏడాది  అవుతున్న  ఇంకా హీరో ఫైనల్ కాలేదు. మొదటగా ఈ సినిమాలో హీరోగా నితిన్ ని ఎంపిక చేశారు. కానీ,  ఈ మధ్య వరుస పరాజయాల రావడంతో .. నితిన్  స్క్రిప్ట్ సెలెక్షన్  విషయంలో ఆచితూచి  అడుగులు వేస్తున్నారట. ఈ క్రమంలో  'ఎల్లమ్మ'  ప్రాజెక్ట్  నుంచి తప్పుకున్నారని  తెలుస్తోంది. 

అయితే 'ఎల్లమ్మ' కథ, పాత్ర స్వభావం పూర్తిగా కమర్షియల్ ఫార్మాట్ కి దూరంగా .. వాస్తవికతకు దగ్గరగా ఉంటుందట. అందుకే నితిన్ తప్పుకున్నారని టాక్.  నితిన్ తప్పుకున్న తర్వాత  చాలా మంది స్థాయి మీడియం రేంజ్  హీరోలను కూడా సంప్రదించారట వేణు. కానీ, ఎవరూ ముందుకు రాలేదట. అయితే  ఇప్పటివరకు తమను కమర్షియల్ హీరోలుగా చూసిన ప్రేక్షకులు.. అందుకు భిన్నమైన పాత్రలో తమను యాక్సెప్ట్ చేస్తారా? అనే ఆలోచనతో   హీరోలెవరూ  రిస్క్ తీసుకోవడంలేదని వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా 'బలగం' తో బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు సినిమాకు హీరోలు దొరకకపోవడం చర్చనీయాంశంగా మారింది.  

ఇదిలా ఉంటే నితిన్ కి ముందు 'ఎల్లమ్మ ' కోసం నేచురల్ స్టార్ నాని పేరు కూడా వినిపించింది. వేణు ఈ సినిమాకు సంబంధించి నానితో చర్చలు కూడా జరిపారు. కానీ, ఆ తర్వాత నాని ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడంలేదని తెలిసింది. నెక్స్ట్ నితిన్ దగ్గరకు వెళ్లగా.. ఇప్పుడు అతను కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. తాజా అప్డేట్ ప్రకారం..  శర్వానంద్ ని ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.  

Also Read: Hero Vishal: కాబోయే భార్యను పరిచయం చేసిన హీరో విశాల్.. ఎంగేజ్మెంట్ పిక్స్ చూశారా!

Advertisment
తాజా కథనాలు