/rtv/media/media_files/2025/10/30/baahubali-the-eternal-war-2025-10-30-07-18-55.jpg)
Baahubali The Eternal War
Baahubali The Eternal War: దర్శక ధీరుడు రాజమౌళి(Rajamouli) సృష్టించిన బాహుబలి సిరీస్ ఇప్పుడు మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. “బాహుబలి: ది ఎపిక్”(Baahubali The Epic) అనే పేరుతో, బాహుబలి 1, 2 సినిమాలను కలిపి ఒకే సినిమాగా రూపొందించారు. ఈ ప్రత్యేక వెర్షన్ అక్టోబర్ 31న థియేటర్లలో గ్రాండ్‌గా రీ-రిలీజ్ అవుతోంది.
Baahubali The Epic Bookings
ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని చోట్ల అద్భుతంగా సాగుతున్నాయి. అభిమానులు ఈ రీ-రిలీజ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంలో నిర్మాత శోభు యార్లగడ్డ ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు “సినిమా చివర్లో ప్రేక్షకులకు ఒక సర్‌ప్రైజ్ ఉంది” అని. దీంతో అందరూ “బాహుబలి 3 అనౌన్స్ చేస్తారా?” అనే ఉత్కంఠలో పడ్డారు.
#Baahubali The Eternal War 💥 Teaser Is Attached The Interval Of #BaahubaliTheEpic 🔥🥵 pic.twitter.com/wfkwi6VqLU
— 🦖 (@Mv__Rebel) October 29, 2025
Baahubali The Epic Interview
అయితే, తాజాగా ప్రభాస్, రాజమౌళి, రాణా దగుబాటి పాల్గొన్న ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ సర్‌ప్రైజ్ రహస్యం బయటపడింది. రాజమౌళి మాట్లాడుతూ “చాలామంది ‘బాహుబలి 3’ వస్తుందనుకుంటున్నారు, కానీ అది కాదు. మేము కొత్త ప్రాజెక్ట్‌కి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. ఆ ప్రాజెక్ట్ పేరు బాహుబలి: ది ఎటర్నల్ వార్” అని చెప్పారు.
#BaahubaliTheEpic#Baahubali - The Eternal War Teaser 😍🤯🥵 pic.twitter.com/F5o4U9ycuA
— Manohar | DHFM | Developer (@Manohar2338) October 29, 2025
ఇంకా రాజమౌళి మాట్లాడుతూ, “ఇది ఒక హై-క్వాలిటీ 3D యానిమేటెడ్ మూవీ, బాహుబలి ప్రపంచాన్ని కొనసాగించే కథ. ఇది పూర్తిగా కొత్త కోణంలో సాగుతుంది. సినిమా బడ్జెట్ దాదాపు ₹120 కోట్లు, దాన్ని టాలెంటెడ్ యానిమేషన్ దర్శకుడు ఇషాన్ శుక్లా దర్శకత్వం వహించారు. ఆయన మాకు బాహుబలి ప్రపంచాన్ని ఇంకా ఎలా విస్తరించవచ్చో కూడా చెప్పారు, ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. ఈ ప్రాజెక్ట్‌పై దాదాపు రెండున్నర సంవత్సరాలుగా కష్టపడి పని చేశారు,” అని రాజమౌళి తెలిపారు.
ఇలా “బాహుబలి: ది ఎటర్నల్ వార్” అనే కొత్త యానిమేటెడ్ చిత్రం రూపంలో, బాహుబలి విశ్వం మరో కొత్త ఫార్మాట్ లోకి అడుగుపెడుతోంది. ఈ కొత్త కాన్సెప్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఇక రీ-రిలీజ్ అవుతున్న “బాహుబలి: ది ఎపిక్” ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో సంచలనం సృష్టిస్తుండగా, ఈ సర్‌ప్రైజ్ ప్రకటన మరింత హైప్ తెచ్చిపెడుతోంది. ప్రభాస్, రాణా, అనుష్క, తమన్నా పాత్రలతో మరోసారి ఆ మహోన్నత గాథను పెద్ద తెరపై చూడటానికి అభిమానులు సిద్ధమవుతున్నారు.
Follow Us