Athadu 4K Re- Realease: సోషల్ మీడియా అంతా మహేష్ బాబు అతడు వైబ్స్ తో నిండిపోయింది. ఎక్కడ చూసిన ఈమూవీకి సంబంధించిన వీడియోలు, ఫ్యాన్ సెలబ్రేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా 'అతడు' సినిమాను 4K వెర్షన్‌లో రీ-రిలీజ్ చేశారు. దీంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ హీరో వింటేజ్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ థియేటర్లలో రచ్చ రచ్చ చేస్తున్నారు. రీరిలీజ్ ని ఒక పండగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని పలు థియేటర్ల వద్ద ఉదయం నుంచే సందడి మొదలైంది. సినిమాలోని సీన్లను, డైలాగులను రిక్రియెట్ చేస్తూ థియేటర్లలో సందడి చేస్తున్నారు.
Monnati daka antha hawa ledu kani ninnati nundi Insta antha Athadufied ayyipoyyindi #Athadupic.twitter.com/mIjsPdHjKw
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) August 8, 2025
ఫ్యాన్ గర్ల్ మూమెంట్
ఈ క్రమంలో ఓ అమ్మాయి థియేటర్లో ''పిల్ల గాలి అల్లరి'' పాటను రిక్రియెట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అచ్చం త్రిష లానే లంగావోణీ ధరించి థియేటర్లో పాటకు స్టెప్పులేసింది. ఆమె డాన్స్ చేస్తుంటే థియేటర్లోని ఆడియన్స్ అంతా విజిల్స్, కేకలు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Fan Girl ❤️🔥
— Addicted To Memes (@Addictedtomemez) August 9, 2025
With Same Costume
Babu Fan Girls Things 😁🫶#MaheshBabu𓃵#Athadu4K#HBDSuperstarMahesh#Athadupic.twitter.com/0pgV5x4lm5
రీరిలీజ్ అయినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అడ్వాన్స్ బుకింగ్‌లో రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్ సీస్ లోని అభిమానులు కూడా ఈ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రీ-రిలీజ్ హక్కులు దాదాపు రూ. 3 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ సినిమా రీ-రిలీజ్ బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల మీద కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇది కూడా చూడండి:Raksha Bandhan 2025: రాఖీ కట్టేటప్పుడు ఎన్ని ముళ్లు వేయాలి? 1 లేదా 2 అనేది తెలియకుండా రాఖీ కడితే అంతే సంగతులు
ఇదిలా ఉంటే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒరిజినల్ సినిమాలకంటే రీరిలీజ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద హవా చూపిస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా తమ ఫేవరేట్ హీరోల వింటేజ్ వైబ్స్ ఎంజాయ్ చేయడానికి తెగ ఇష్టపడుతున్నారు.