GHAATI SONG: టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత 'ఘాటీ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మాదకద్రవ్యాల మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మెల్లిగా మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. సినిమాకు సంబంధించిన ప్రచారం చిత్రాలను, పాటలను ఒకదాని తర్వాత ఒకటి విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా మూవీ నుంచి సెకండ్ లిరికల్ వీడియో 'దస్సోరా' పాటను రిలీజ్ చేశారు. ''తూరుపు కనుమన నడుమింటి... కారడవుల్లో కాలెట్టి...సిరుతై ఉరికే యమజట్టి... వేటకి కదిలే ఘాటీ''...’అంటూ ర్యాప్ స్టైల్ సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సినిమాలో అనుష్క పాత్రను తెలియజేసేలా ఈ పాట లిరిక్స్ ఉన్నాయి. సాగర్ నాగవల్లి సంగీతం అందించిన ఈ పాటను గీతామాధురి, సాకేత్, శృతి రంజని కలిసి పాడారు. ఈఎస్ మూర్తి లిరిక్స్ రాశారు.
🥰The SOUND of GHAATIS 🥰
— Anushka Shetty (@MsAnushkaShetty) August 20, 2025
Is ooooooooouuuuuuutttttttttt now …..😃🥰🧿🙏🏻💃#GhaatiSecondSingle#Dassora out now!
Telugu : https://t.co/TmPaI2awXX
Tamil : https://t.co/r8VNezQngH#GHAATI GRAND RELEASE WORLDWIDE ON 5th SEPTEMBER 2025
Thank you alll for all ur love 🫠🧿… pic.twitter.com/4XLxAtK6wc
రెండవ సినిమా..
యువీ క్రియేషన్స్ నిర్మాణంలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 'వేదం' తర్వాత క్రిష్- అనుష్క కాంబోలో రాబోతున్న ఈ సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇందులో తమిళ నటుడు విక్రమ్ మేల్ లీడ్ గా నటిస్తున్నారు. చైతన్యరావు, జగపతిబాబు, రవీంద్ర తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ లో ఉంది.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో జరిగే గంజాయి, మాదకద్రవ్యాలు, మాఫియా నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ లో అనుష్క గంజాయి మాఫియా డాన్ గా నోట్లో బీడీ పెట్టుకొని పవర్ ఫుల్ లుక్ లో కనిపించింది. ఒక సాధారణ మహిళగా ఉన్న అనుష్క గంజాయి వ్యాపారంలో చిక్కుకుని, చివరికి అదే వ్యాపారంలో ఒక శక్తివంతమైన వ్యక్తిగా మారింది అనేది సినిమా కథని ట్రైలర్ చూస్తే ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ చూసిన తర్వాత ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
అయితే మొదటగా ఈ చిత్రాన్ని జులై 11న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ, గ్రాఫిక్స్ పనుల వల్ల సినిమాను వాయిదా వేసినట్లు తెలిసింది. చివరికి సెప్టెంబర్ 5న విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఇదిలా ఉంటే విడుదలకు ముందే ఘాటీ సినిమా హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. మహిళా ప్రధానంగా తెరకెక్కుతున్న సినిమాకు ఈ రేంజ్ లో డిమాండ్ ఉండడం విశేషం!