వావ్ క్రేజీ కాంబో.. అనుదీప్ ఆ హీరోతో కలిస్తే నెక్స్ట్ లెవెల్ జాతిరత్నాలు!

డైరెక్టర్ అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను అనౌన్స్ చేశారు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా 'ఫంకీ' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. నాగ్‌అశ్విన్‌ సినిమాకు క్లాప్ కొట్టారు.

New Update
anudeep

anudeep kv

Director Anudeep:  డైరెక్టర్ అనుదీప్ ఈ పేరు వినగానే అందరికీ గుర్తొచ్చేది జాతిరత్నాలు. ఈ ఒక్క సినిమాతో డైరెక్టర్ గా అనుదీప్ రేంజే మారిపోయింది. 2021లో విడుదలైన ఈ సినిమాలోని కామెడీ, పంచ్ డైలాగ్స్, వన్ లైనర్స్ యూత్ ను ఓ రేంజ్ లో ఆకట్టుకున్నాయి. యూత్ కి  కనెక్ట్ అయ్యేలా ట్రెండ్ కు తగ్గ  సినిమాలు చేసి.. మంచి క్రేజ్ తెచ్చుకున్నారు ఈ యువ డైరెక్టర్.  

విశ్వక్ సేన్ తో ఫంకీ.. 

జాతిరత్నాలతో నవ్వులు పూయించిన అనుదీప్.. చాలా గ్యాప్ తర్వాత  మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా  'ఫంకీ' సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ తో పూజ కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు. డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ ఈ సినిమాకు క్లాప్ కొట్టి.. శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో ఆషికా రంగనాథ్ ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. సాధారణంగానే విశ్వక్ మాస్ డైలాగ్స్, కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇక ఇప్పుడు విశ్వక్ కి అనుదీప్ తోడవడం క్రేజీ కాంబో అనే చెప్పాలి. జాతిరత్నాలు, ప్రిన్స్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తో అనుదీప్ మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. 

Also Read: బిగ్ ట్విస్ట్! 20 లక్షల సూట్ కేస్‏తో అవినాష్ అవుట్? మిడ్‏వీక్ ఎలిమినేషన్

 

విశ్వక్ ఇటీవలే మెకానిక్ రాకీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మిశ్రమ స్పందన సొంతం చేసుకుంది. 'ఫంకీ' తో పాటు ప్రస్తుతం విశ్వక్ రామ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ‘లైలా’ సినిమా చేస్తున్నారు. 

Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు