Actress Anasuya: చెప్పు తెగుద్ది.. స్టేజ్ పైనే అనసూయ వార్నింగ్! (వీడియో వైరల్)

అసభ్య కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ యాంకర్ అనసూయ స్టేజ్ పైనే వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే అనసూయ మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కి వెళ్లగా.. అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
anchor anasuya

anchor anasuya

Actress Anasuya: అసభ్య కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది అంటూ యాంకర్ అనసూయ స్టేజ్ పైనే వార్నింగ్ ఇవ్వడం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇటీవలే అనసూయ మార్కాపురంలోని ఓ షాపింగ్ మాల్ ఓపినింగ్ కి వెళ్లగా.. అక్కడ ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనసూయ స్టేజ్ పై మాట్లాడుతుండగా.. కొందరు ఆకతాయిలు, పోకిరీలు అసభ్యకర కామెంట్లు చేయడంతో ఆమె ఫైర్ అయ్యారు. అసభ్యకర కామెంట్లు చేస్తే చెప్పు తెగుద్ది.. మీ ఇంట్లో చెల్లి, అమ్మ, గర్ల్ ఫ్రెండ్, భార్యను ఇలాగే ఏడిపిస్తే ఊరుకుంటారా? పెద్దవాళ్ళను ఎలా గౌరవించాలి, వారితో ఎలా మెలగాలి అనేది ఇంట్లో నేర్పలేదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. 

గతంలో కూడా.. 

ఇదిలా ఉంటే సోషల్ మీడియానూ తనపై కామెంట్లు చేసేవారికి గట్టిగా కౌంటర్లు ఇస్తుంది అనసూయ. రీసెంట్ గా తన వస్త్రాధారణ గురించి కామెంట్స్ చేయగా.. ''నేను బికినీ వేసుకున్నానా , బట్టలు విప్పేసి తిరిగా అందంతా నా ఇష్టం! నా డ్రెస్సింగ్ పై కామెంట్ చేసే హక్కు మీకు లేదు'' అంటూ ఇచ్చిపడేసింది. బుల్లితెరపై యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన.. ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో ఇండస్ట్రీలో బిజీగా ఉంది. రామ్ చరణ్ 'రంగస్థలం' సినిమాలో 'రంగమ్మత్త' పాత్ర అనసూయకు భారీ పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత  'పుష్ప' ఫ్రాంచైజీలో 'దాక్షాయణి' క్యారెక్టర్ లో మరోసారి మెప్పించింది. ఇటీవలే హరిహరవీరమల్లు సినిమాలో కొల్లగొట్టినాదిరో పాటలో తన డాన్స్ పర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసింది.

తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. తమిళ్లో 'ఫ్లాష్‌బ్యాక్‌', 'వోల్ఫ్‌' చిత్రాలు చేస్తోంది.  సినిమా అవకాశాలు పెరగడంతో టీవీ షోల్లో ఎక్కువగా కనిపించడం లేదు అనసూయ. ఒకటి, రెండు షోలు, అప్పుడప్పుడు ఈవెంట్లలో సందడి చేస్తుంటుంది. జబర్దస్త్, మోడ్రన్ మహాలక్ష్మీ, డ్రామా జూనియర్స్, కిర్రాక్ బాయ్స్, కిలాడీ గర్ల్స్ వంటి షోలు బుల్లితెరపై అనసూయకు బాగా పేరు తెచ్చాయి.

ఓ పక్క సినిమాలు, షోలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది అనసూయ. తరచూ లేటెస్ట్ కొత్త కొత్త లుక్స్ లో ఫొటో షూట్లను షేర్ చేస్తూ తన అందాలను ప్రదర్శిస్తుంటుంది. అలాగే తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది.  ఇటీవలే కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసినట్లు తెలియజేస్తూ వీడియోలను, ఫోటోలను పంచుతుంది. తన కలల ఇంటికి 'శ్రీరామసంజీవని' అని పేరు పెట్టుకుంది. గృహప్రవేశం తర్వాత తన కొడుకు 'ఉపనయనం' వేడుకను నిర్వహించింది అనసూయ. హిందూ సంప్రదాయాలు, కట్టుబాట్ల ప్రకారం ఉపనయనం వేడుకను ఘనంగా చేసింది. 2010లో సుశాంక్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకున్న అనసూయకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Also Read: 71th National Film Award: ఊరూ పల్లెటూరు.. 'బలగం' పాటకు జాతీయ అవార్డు తెచ్చిన లిరిక్స్ ఇవే !

Advertisment
తాజా కథనాలు