ప్రభాస్ ఫ్యాన్స్ , అశ్వినీదత్ ను కెలికిన అనంత శ్రీరామ్.. కర్ణుడుపై, కల్కి సినిమాపై షాకింగ్ కామెంట్స్

లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ హైందవ సభలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమాలో కర్ణుడి పాత్రను చూపించిన తీరుపై విమర్శలు చేశారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని.. పురాణాలను వక్రీకరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Anantha Sriram

Anantha Sriram

Anantha Sriram: నిత్యం వివాదాల్లో చిక్కుకునే, సనాతన ధర్మాన్ని భుజాన వేసుకొని వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ మరోసారి అదే పని చేశాడు. తాజాగా అమరావతి పరిధిలోని కేసరపల్లిలో ఏర్పాటు చేసిన హైందవ శంఖారావం బహిరంగ సభలో ఆయన చేసిన కామెంట్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. 

ప్రభాస్ 'కల్కి'  పై  విమర్శలు.. 

హైందవ శంఖారావం సభలో అనంత్ శ్రీరామ్ సినిమాల్లో పురాణాలను చూపించే విధానం పై అసహనం వ్యక్తం చేశారు.  కల్కి సినిమాలో కర్ణుడిని చూపించిన తీరుపై విమర్శలు చేశారు. అనంత శ్రీరామ్ మాట్లాడుతూ.. గత ఎన్నో సంవత్సరాలుగా రిలీజ్ అవుతున్న సినిమాల నుంచి రీసెంట్ గా విడుదలైన 'కల్కి' చిత్రం వరకు కర్ణుడికి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నాని అన్నారు. అప్పటి సినిమా దర్శకులు, ఇప్పటి సినీ నిర్మాతలు కృష్ణా జిల్లాకు చెందిన వారైనప్పటికీ.. నేను అదే గడ్డ మీద చెబుతున్న పొరపాటును.. పొరపాటు అని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు.. హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు. 

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

కర్ణుడిని వీరుడు, సూరుడు అంటే హైందవ ధర్మం ఎలా ఒప్పుకుంటుంది? ధర్మరాజు అంత గొప్పవాడు కాదని, కర్ణుడే గొప్పవాడు అంటే హైందవ ధర్మం ఒప్పుకుంటుందా? అని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవలే వచ్చిన కల్కి సినిమాలో అగ్ని దేవుడు ఇచ్చిన ధనుస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సును పట్టిన కర్ణుడు వీరుడని చెబుతుంటే.. యుద్ధంలో గెలిచేది ధనుస్సా? ధర్మమా? అని ప్రశ్నించకుండా  ఊరుకుంటామా ? సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోంది..  పురాణాలను వక్రీకరిస్తున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Winter: మగవారి కంటే ఆడవాళ్ళకి చలి ఎందుకు ఎక్కువ ? కారణం తెలుసుకోండి..మీకే మంచిది

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు