/rtv/media/media_files/2025/10/21/allu-sirish-wife-2025-10-21-13-18-47.jpg)
allu sirish wife
Allu Sirish: అల్లువారి చిన్నకుమారుడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శిరీష్ తన కాబోయే భార్య నయనికను పరిచయం చేశారు. ఈనెల 31న ఈ జంట నిశ్చితార్థం చేసుకోబోతున్నారు. అయితే శిరీష్ ఇప్పటివరకు తన కాబోయే ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. కేవలం ఆమె చేయి పట్టుకొని ఉన్న ఫొటోను మాత్రమే షేర్ చేశాడు. ఈ క్రమంలో అల్లువారింటి దీపావళి వేడుకకు సంబంధించిన ఓ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో అల్లు శిరీష్ కాబోయే భార్య నయనిక మొహం మొదటిసారి కనిపించింది.
శిరీష్ కాబోయే భార్య పిక్ వైరల్
ఈ ఫొటోలో అల్లు అర్జున్, అల్లు బాబీ తమ సతీమణులు, పిల్లలతో కలిసి కనిపించగా.. అల్లు శిరీష్ కూడా ఒక అమ్మాయి కనిపించింది. దీంతో ఆమె అల్లు శిరీష్ కాబోయే భార్యేనని అంతా అనుకుంటున్నారు. ఈ ఫ్యామిలీ ఫొటోను అల్లు శిరీష్ అన్నయ్య అల్లు బాబీ తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా నెట్టింట ఫుల్ వైరల్ అయ్యింది. అయితే వెంటనే ఈ ఫొటోను తొలగించినప్పటికీ.. అప్పటికే చాలా మంది చూసి వైరల్ చేశారు.
అల్లు శిరీష్ ఫియాన్సీ ఎవరు.. పండగ వేడుకల్లో ఆమెను గుర్తించారా..?
— Tupaki (@tupaki_official) October 21, 2025
అల్లు ఫ్యామిలీలో కొత్త సంబరం మొదలైంది. ఇటీవల అల్లు శిరీష్ ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీపావళి వేడుకల్లో అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫోటోలో శిరీష్ పక్కన కనిపించిన అమ్మాయి అతని… pic.twitter.com/HPss81j6Q6
శిరీష్ ఈ ఏడాది నిశ్చితార్థం చేసుకొని.. వచ్చే ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే శిరీష్ కాబోయే భార్య నయనిక ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కి సంబంధించిన వివరాలేవీ కూడా ఇంకా రివీల్ చేయలేదు. అయితే సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఆమె హైదరాబాద్ కి చెందిన ఓ ప్రముఖ వ్యాపార వేత్త కూతురని తెలుస్తోంది. అది మాత్రమే కాదు శిరీష్ ఆమెను ప్రేమ వివాహం చేసుకుంటున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఇరు కుటుంబ సభ్యుల అంగీకారంతో ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు సమాచారం. మొత్తానికి అల్లు శిరీష్ త్వరలోనే తన బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పేసి.. ఓ ఇంటివాడు కాబోతున్నారు.
Also Read: Samantha Love: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సంబరాలు.. ఫొటోలు ఎంత ముద్దుగున్నాయో?
Follow Us