/rtv/media/media_files/2025/11/17/allu-arjun-2025-11-17-10-31-00.jpg)
Allu Arjun
Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం దర్శకుడు అట్లీ కుమార్‌తో కలిసి చేస్తున్న కొత్త సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఇప్పటివరకు AA22xA6 పేరుతో పిలుస్తున్నారు. దీపికా పడుకోణె హీరోయిన్‌గా నటిస్తుండటంతో ప్రాజెక్ట్‌పై మరింత హైప్ పెరిగింది.
అయితే ఈసారి అల్లు అర్జున్ సినిమా గురించి కాదు, ఆయన ఫోన్ వాల్‌పేపర్‌కి సంబంధించిన ఒక చిన్న విషయమే అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. అల్లు అర్జున్‌కు వ్యక్తిగత ట్రైనర్‌గా ఉన్న లాయిడ్ స్టీవెన్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వర్కౌట్ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో అల్లు అర్జున్ ట్రెడ్మిల్లుపై పరుగెత్తుతూ కనిపించారు. కానీ అందరి దృష్టిని ఆకర్షించింది ఆయన ఫోన్ స్క్రీన్.
ఫోన్ వాల్ పేపర్లో ఏముందంటే..? Allu Arjun Phone Wallpaper
No Snack
No Sugar
No Soda
అంటే ఆయన తీసుకుంటున్న ప్రత్యేక డైట్ రూల్స్ అని ఫ్యాన్స్ వెంటనే అర్థం చేసుకున్నారు. వీటి పైభాగంలో March 27, 2026 అని ఒక తేదీ కూడా ఉంది. దీంతో అభిమానులు అల్లు అర్జున్ ఆ రోజు వరకు ఈ నియమాలను పాటించాలని తనకు తనే చాలెంజ్ పెట్టుకున్నారని అనుకుంటున్నారు.
ఆ స్క్రీన్‌షాట్ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా వైరల్ అయింది. కేవలం కొన్ని గంటల్లోనే #NoSnackNoSugarNoSoda అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. అల్లు అర్జున్ ఇలా క్రమశిక్షణతో ఫిట్‌నెస్‌కి ప్రాధాన్యం ఇస్తున్న తీరు చూసి చాలామంది తమ జీవితాల్లో కూడా ఇలాంటి రూల్స్ ఫాలో కావాలని కామెంట్లు చేశారు.
ఇక సినిమాకి వస్తే…
అల్లు అర్జున్ - అట్లీ సినిమా షూట్ శరవేగంగా కొనసాగుతోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో చేరినట్టు వార్తలు వస్తున్నప్పటికీ, సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించలేదు. ఈ భారీ సినిమా 2027 వరకు పూర్తయ్యే అవకాశం ఉందని టాక్. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. అల్లు అర్జున్ ఫిట్‌నెస్ ప్రిపరేషన్, ఈ సినిమా షూట్ గురించి త్వరలో మరిన్ని అప్‌డేట్లు రావాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Follow Us