/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-one-2025-08-30-19-38-13.jpg)
'సప్త సాగరదాచె ఎల్లో' చిత్రంతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది కన్నడ కుట్టి రుక్మిణి వసంత్. ఈ సినిమాలో రుక్మిణి ప్రియా పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆమె గ్లామర్, నటనకు మంచి మార్కులు పడ్డాయి.
/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-two-2025-08-30-19-38-13.jpg)
ఈ సినిమా విజయంతో రుక్మిణి ఫాలోయింగ్ అమాంతం పెరిగింది. తెలుగు, తమిళం, కన్నడ సినిమాల నుంచి వరస పెట్టి ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం రుక్మిణీ భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-three-2025-08-30-19-38-13.jpg)
తమిళ్, కన్నడ, తెలుగులో కలిపి మూడుకు పైగా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉంది. తమిళ్ ల్లో శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న మదరాశి సినిమాలో నటిస్తోంది.
/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-four-2025-08-30-19-38-13.jpg)
కన్నడలో రిషబ్ శెట్టి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కాంతార: చాప్టర్ 2 లో ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. దీంతో పాటు కేజీఎఫ్ స్టార్ యష్ 'టాక్సిక్' సినిమాలో కూడా రుక్మిణీ హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.
/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-five-2025-08-30-19-38-13.jpg)
ఇక తెలుగులో స్టార్ హీరో ఎన్టీఆర్ జోడిగా ఈ ముద్దుగుమ్మ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న 'డ్రాగన్ ' లో రుక్మిణీ హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-six-2025-08-30-19-38-13.jpg)
మొత్తానికి రుక్మిణి కెరీర్ పరంగా వేగంగా అడుగులు వేస్తోంది. అయితే రుక్మిణి కేవలం నటి మాత్రమే కాదు అద్భుతమైన డాన్సర్ కూడా. కెరీర్ ప్రారంభించిన తక్కువ కాలంలోనే తన నటనలో నైపుణ్యాన్ని ప్రదర్శించింది రుక్మిణి.
/rtv/media/media_files/2025/08/30/rukmini-vasanth-pic-seven-2025-08-30-19-38-13.jpg)
'సప్త సాగరదాచె ఎల్లో' సినిమాలో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. సున్నితమైన భావోద్వేగాలను పలికించడంలో ప్రత్యేకత చూపించింది రుక్మిణి.