అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ వచ్చేసింది! ఏమన్నారంటే?

అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ వైరలైన వార్తలపై ఆయన టీమ్ స్పందించింది. ఆ ప్రచారం పూర్తిగా తప్పు, నిరాధారమైనదని. ప్రశాంత్ కిషోర్‌తో ఎలాంటి భేటీ జరగలేదని.. తప్పుడు ప్రచారం చేయొద్దని అల్లు అర్జున్ టీమ్ విజ్ఞప్తి చేసింది.

New Update

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయాలతో ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేని అల్లు ఫ్యామిలీ.. రాజకీయాల్లోకి వచ్చేందుకు సలహాలు, సూచనల కోసం  ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ రహస్యంగా భేటీ అయినట్లు నెట్టింట వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఈ భేటీలో అల్లు అర్జున్ కు ప్రశాంత్ కిషోర్ పలు కీలక సూచనలు చేశారని టాక్. 

Also Read: రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

రాజకీయాల ఎంట్రీ పై బన్నీ క్లారిటీ.. 

అయితే తాజాగా అల్లు అర్జున్ టీమ్ ఈ వార్తలపై స్పందించిన. బన్నీ రాజకీయాల్లోకి రావడం పై క్లారిటీ ఇచ్చింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి వస్తున్నారనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పారు. ఆ ప్రచారం పూర్తిగా  నిరాధారమైనదని. ప్రశాంత్ కిషోర్‌తో ఎలాంటి భేటీ జరగలేదని..తప్పుడు ప్రచారం చేయొద్దని అల్లు అర్జున్ టీమ్ విజ్ఞప్తి చేసింది.   

ఇది ఇలా ఉంటే 'పుష్ప2' ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తోంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా .. తొలిరోజు నుంచి రికార్డు స్థాయిలో వసూళ్లను నమోదు చేస్తోంది. తొలిరోజు రూ.294 కోట్ల వసూళ్లను సాధించి ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా చరిత్ర సృష్టించింది. వారం రోజుల్లోనే  అత్యంత వేగంగా 1000 క్లబ్ లో చేరిన సినిమాగా కూడా ఘనత సాధించింది. 

నార్త్ లో పుష్ప2 హవా..

ముఖ్యంగా నార్త్ లో పుష్ప2 హవా ఎక్కువగా కనిపిస్తోంది. హిందీ ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. తొలిరోజు ఈ చిత్రం బాలీవుడ్ సినిమాల ఓపెనింగ్ రికార్డులను సైతం  వెనక్కి నెట్టేసి  రూ.72 కోట్లతో  హిందీలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా రికార్డు క్రియేట్  చేసింది. 

Also Read: సాయి పల్లవి అలా అనడంతో మనసు ముక్కలైంది.. శివ కార్తికేయన్ మాటలు వింటే షాక్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు