Allu Arjun Sandhya Theatre
Allu Arjun: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే తాజాగా ఈ ఘటనలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అల్లు అర్జున్ థియేటర్ కి రాకముందే తొక్కిసలాట జరిగినట్లు సీసీ ఫుటేజ్ వైరల్ అవుతోంది. అయితే పోలీసులు చూపించిన వీడియోలో డిసెంబర్ 4న రాత్రి 9.40 ప్రాంతంలో అల్లు అర్జున్ థియేటర్‌లోకి వచ్చినట్లుగా.. ఆ తర్వాత 9.45-9.50 గంటల మధ్యలో తొక్కిసలాటలో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయిన రేవతి, శ్రీతేజ్ ను బయటకు తీసుకొచ్చినట్లుగా ఉంది. కానీ.. ఇప్పుడు రాత్రి 9.16 గంటలకే రేవతిని బయటికి తీసుకొస్తున్నట్లు ఫుటేజ్ వైరలవుతోంది. దీంతో బన్నీ ఫ్యాన్స్.. అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగింది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ ఫుటేజ్ లో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
ఇది కూడా చదవండి.. తిరుపతిలో అపచారం..అన్నమయ్య విగ్రహానికి శాంటక్లాస్ టోపీ పెట్టిన దుండగులు
విచారణలో పాల్గొన్న అల్లు అర్జున్
ఇది ఇలా ఉంటే తొక్కిసలాట ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ఉదయం 10.30 గంటలకు చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరయ్యాడు. ఈ విచారణలో అల్లు అర్జున్ ని సెంట్రల్ జోన్ డీసీపీ ఆకాంక్ష్ యాదవ్ పలు అంశాలపై విచారించారు. తొక్కిసలాటకు సంబంధించిన 10 నిమిషాల వీడియోను చూపించన అనంతరం బన్నీని ఇంటరాగేషన్ చేయగా కాస్త గందరగోళానికి గురైనట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానాలు చెప్పిన బన్నీ.. పలు కీలక ప్రశ్నలకు మాత్రం నోరు మెదపలేదని సమాచారం.
Also Read: Hansika: హన్సిక అందాలు అదుర్స్.. డిజైనర్ లెహంగా, భారీ నెట్ సెట్ తో స్టన్నింగ్ ఫోజులు!
ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఒకవేళ బన్నీ పై వస్తున్న ఆరోపణలు నిజమైతే ఆయన మళ్ళీ అరెస్టయ్యే అవకాశం కూడా ఉందని అంటున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ పై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. వ్యతిరేకంగా భారీగా పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. కొంతమంది అల్లు అర్జున్ ని సమర్దిస్తుండగా.. మరి కొంతమంది అల్లు అర్జున్ కారణంగానే ఓ నిండు ప్రాణం పోయిందని తిట్టిపోస్తున్నారు.
ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!