Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప - 2 ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. బాహుబలి 2 తర్వాత భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఇంత భారీ వసూళ్లు ఉన్నప్పటికీ, ఏపీ నైజాం ఏరియాలో ఈ సినిమా వసూళ్లు తక్కువగా ఉన్నాయి. హిందీ బెల్ట్ నుంచే ఈ సినిమాకు ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి.
ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!
సీడెడ్ లో బ్రేక్ ఈవెన్
తెలుగు రాష్ట్రాల్లోని సీడెడ్ ఏరియాల్లో పుష్ప- 2 బ్రేక్ ఈవెన్ నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అంతోఇంతో సీడెడ్ నుంచి మాత్రమే ఈ సినిమాకు లాభాలు కనిపించేలా ఉన్నాయి. ఇక ఆంధ్ర, నైజాం ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కష్టమే అంటున్నాయి ట్రేడ్ వర్గాలు . ఆంధ్రాలో ఈ సినిమా భారీగా నష్టపోతుందని కొందరు అంటున్నారు. కానీ సంక్రాంతి వెకేషన్ ఉండడంతో సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. నిర్మాతలు కూడా అప్పటివరకు థియేటర్స్ లో సినిమాను ఆడించాలని అనుకుంటున్నట్లు సమాచారం. అలాగే టికెట్ ధరలు తగ్గించడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు. దీంతో ఆంధ్ర, నైజాం ఏరియాల్లో కూడా త్వరలోనే బ్రేక్ ఈవెన్ రీచ్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల అంచనా.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
పుష్ప 2 విడుదలై రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.1300 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన నటించగా.. ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించారు.
ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!