'పుష్ప2' ప్రీ రిలీజ్ వేదిక ఫిక్స్.. ఈవెంట్ జరిగేది అక్కడే..! అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'పుష్ప2' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పర్మిషన్ వచ్చేసింది. హైదరాబాద్ యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో పుష్ప2 ప్రీ రిలీజ్ నిర్వహించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. By Archana 25 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update pushpa 2 షేర్ చేయండి Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ పుష్ప2 పై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఇటీవలే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. 24గంటల్లోనే యూట్యూబ్ లో 42 మిలియన్లకు పైగా వ్యూస్ తో దుమ్మురేపింది. ఈ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించాలని ప్లాన్ చేసారు మేకర్స్. కానీ హైదరాబాద్ లో గత అక్టోబర్ 28 నుంచి నవంబర్ 28 వరకు ఈ కర్ఫ్యూ అమలులో ఉండడంతో.. ఎంటువంటి అవుట్ డోర్ ఫంక్షన్స్ కి అనుమతించలేదు. దీంతో సినిమా పరిశ్రమకు అనుకోని ఇబ్బందులు ఎదురయ్యాయి. Also Read: Allu Arha: నా 8ఏళ్ల ఆనందం.. కూతురు బర్త్‌డే సందర్భంగా అల్లు అర్జున్ విషెస్ వైరల్! హైదరాబాద్ లో పుష్ప2 ప్రీ రిలీజ్ ఈ క్రమంలో తాజాగా పుష్ప2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పర్మిషన్ వచ్చింది. ముందుగా మేకర్స్ హైదరాబాద్ లోని LB స్టేడియం లో ఈవెంట్ నిర్వహించేందుకు అనుమతి కోరగా.. అదే రోజు వేరే ఈవెంట్ బుక్కై ఉండడంతో కుదరలేదు. ఆ తర్వాత గచ్చిబౌలి స్టేడియంలో చేసుకునేందుకు అనుమతి కోరగా.. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఇన్ని ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు పుష్ప2 ప్రీ రిలీజ్ వేదికగా ఫిక్స్ అయ్యింది. అధికారులు యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో చేసుకోవాలని సూచించగా అందుకు మేకర్స్ అంగీకరించారు. దీనికి పర్మిషన్స్ కూడా పూర్తి చేశారు. Also Read: రూ.1200కోట్ల సినిమా మిస్ చేసుకున్న సామ్.. అందులో హీరో ఎవరో తెలుసా..! Also Read: ఎట్టకేలకు బయటపడ్డ విజయ్ - రష్మిక సీక్రెట్ రిలేషన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి