BREAKING : అల్లు అర్జున్ కు బిగ్ షాక్.. మరోసారి పోలీస్ స్టేషన్ కు..!

అల్లు అర్జున్‌ నేడు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నారు. కోర్టు షరతుల్లో భాగంగా స్టేషన్ కు వెళ్లి సంతకం చేయనున్నారు. మరికాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

New Update
allu arjun Nampally court.

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ నేడు చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లనున్నారు. సంధ్య థియేటర్‌ తొక్కిసలాట కేసు విచారణ నేపథ్యంలో ప్రతి ఆదివారం పీఎస్‌ ముందు హాజరుకావాలని నాంపల్లి కోర్టు ఆయన్ను ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు షరతుల్లో భాగంగా స్టేషన్ కు వెళ్లి సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి స్టేషన్లో హాజరై సంతకం చేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో మరికాసేపట్లో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు రానున్నారు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు