శ్రీతేజ్ లేచాడు.. అల్లు అర్జున్ కి శుభవార్త!

సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న శ్రీతేజ్ స్పృహలో వచ్చినట్లు తెలుస్తోంది. తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ గత 2 వారాలుగా 'కిమ్స్' ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు.

New Update

Allu Arjun:  అల్లు అర్జున్ పుష్ప2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్స్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళా మృతి చెందగా.. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. గత 17 రోజులుగా కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నాడు.  

 

కళ్ళు తెరిచిన శ్రీతేజ్.. 

అయితే తాజగా కిమ్స్ వైద్యులు శ్రీతేజ్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. శ్రీతేజ్ స్పృహలోకి వచ్చినట్లు తెలిపారు. కళ్ళు తెరిచినప్పటికీ ఎవరినీ గుర్తుపట్టడం లేదట. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. 

ఇది కూడా చూడండి:  తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్‌ ది సీన్స్! ట్రైలర్ చూశారా

అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్

 అయితే  పోలీసుల మాట వినకుండా ర్యాలీకి అల్లు అర్జున్ రాడంతోనే తొక్కిసలాట జరిగిందని..ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందడమే కాక...శ్రీతేజ్ ప్రాణాలకోసం పోరాడుతున్నాడని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్‌కు ఇచ్చిన బెయిల్ రద్దు చేసి మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీతేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ లభించినట్లు అయ్యింది.  ఇప్పటికే సంధ్యా థియేటర్ ఘటనలో అరెస్టైన అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ముందుగా నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించిగా.. హైకోర్టును ఆశ్రయించారు. వాదోపవాదనలు విన్న హైకోర్టు అల్లు అర్జున్ కి 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

ఇది కూడా చూడండిభారతీ.. ట్యూషన్‌ ఫీజు కట్టావా'.. అబ్బా! ఈగ సినిమా లెవెల్లో రాజమౌళి ఫస్ట్ లవ్

Advertisment
Advertisment
తాజా కథనాలు