Allu Arjun Arrest: టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఆయనను అరెస్టు చేసిన తీరుపై పలు రకాల విమర్శలు వెలువెత్తాయి. పోలీసులు అల్లు అర్జున్ ని నేరుగా బెడ్ రూమ్ లోకి వెళ్లి అరెస్ట్ చేశారని, ఆయనతో దురుసుగా ప్రవర్తించారని వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేశారు. బెడ్ రూమ్ లోకి వచ్చి అదుపులోకి తీసుకున్నారని, కనీసం బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదని వాపోయాడు.
Also Read: అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697.. జైలులో రాత్రి ఏం చేశాడంటే?
బన్నీ అబద్దం చెప్పాడు..
అయితే ఈ వార్తలను పోలీసులు ఖండించారు. "తాము వారి ఇంటికి వెళ్ళగానే అల్లు అర్జున్ బట్టలు మార్చుకోవడానికి సమయం అడిగారని. ఆ తర్వాత బన్నీ బెడ్ రూమ్ కి వెళ్లారని.. పోలీసు సిబ్బంది బయటే ఉన్నారని తెలిపారు. ఆయన బయటకు వచ్చాకే కస్టడీలోకి తీసుకున్నామని.. భార్య, కుటుంబంతో మాట్లాడేందుకు కూడా ఆయనకు సమయం ఇచ్చామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: బన్నీని చూడగానే వెక్కి వెక్కి ఏడ్చిన భార్య, పిల్లలు!
అల్లు అర్జున్ కు నిన్న సాయంత్రమే బెయిల్ మంజూరు అయినప్పటికీ పలు కారణాల చేత జైల్లోనే ఉండాల్సి వచ్చింది. దీంతో జైలు అధికారులు బన్నీని అండర్ టైల్ ఖైదీగా ( ఖైదీ నెంబర్ 7697) పేరుతో మంజీరా బ్యారక్ లో ఉంచారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ పై హైకోర్టును ఆశ్రయించగా మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు అల్లు అర్జున్‌కు వర్తించవని తెలిపింది.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన మాస్ కా దాస్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?