Allu Aravind: సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కి రోజు రోజుకు టెన్షన్ పెరిగిపోతుంది. ఈ తొక్కిసలాటలో గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను పరామర్శించేందుకు వెళ్లారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అతడి చికిత్సకు అయ్యే ఖర్చంతా భరిస్తానని.. ఫ్యామిలీకి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చూడండి: తారక్, చరణ్ ఫ్యాన్స్ కు పండగ.. థియేటర్స్ లో RRR బిహైండ్ ది సీన్స్! ట్రైలర్ చూశారా
శ్రీతేజ్ ను కలవలేకపోతున్నాను..
ఇప్పటికే అల్లు అర్జున్ కోర్టు చిక్కుల కారణంగా శ్రీతేజ్ ను కలవడానికి హాస్పిటల్‌కు వెళ్లలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేశారు. దీంతో ఈరోజు ఆయన తండ్రి అల్లు అరవింద్ హాస్పిటల్ కి వెళ్లి బాలుడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇది ఇలా ఉంటే.. అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌ను రద్దు చేయాలని పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నట్లు తాజా సమాచారం బయటికొచ్చింది. డిసెంబర్ 13న సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ ని అరెస్టు చేయగా.. వాదోపవాదనలు విన్న హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ప్రకటించింది.
Also Read: 2024లో ప్రపంచాన్ని వణికించిన భయంకరమైన వ్యాధులివే.. ఇందులో మీకు ఏదైనా సోకిందా?