JIGRA Trailer: గతేడాది 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ' రొమాంటిక్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన అలియా.. మరో సరి కొత్త యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోనికా, ఓ మై గర్ల్ ఫ్రెండ్ చిత్రాల ఫేమ్ వాసన్ బాలా దర్శకత్వంలో అలియా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జిగ్రా'. ధర్మ ప్రొడక్షన్స్ పొడక్షన్స్ బ్యానర్ పై కరణ్ జోహార్, ఆలియాభట్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, షాహీన్ భట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన టీజర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకోగా.. ట్రైలర్ మరింత అంచనాలను పెంచేస్తోంది.
జిగ్రా ట్రైలర్
తమ్ముడిని కాపాడడానికి అక్క చేసే పోరాటం నేపథ్యంలో సాగిన ఈ ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆలియా జైల్లో ఉన్న తన తమ్ముడిని రక్షించుకోవడానికి పోరాటం చేస్తున్నట్లుగా ట్రైలర్ లో చూపించారు. అసలు ఆలియా తమ్ముడు జైల్లో ఎందుకు ఉన్నాడు..? అతడిని రక్షించుకునే క్రమంలో ఆలియాకు ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొంది..? అనే అంశాలతో ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది. ట్రైలర్ లో ఆలియా యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా నిలిచాయి. మొత్తానికి 'జిగ్రా' ట్రైలర్ యాక్షన్, ఎమోషన్ తో నిండిపోయింది. ఈ మూవీలో 'ది ఆర్చీస్' ఫేమ్ వేదంగ్ రైనా ఆలియా తమ్ముడి పాత్రలో నటించాడు. టాలీవుడ్ నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా ఈ సినిమాలో మరో కీలక పాత్ర పోషించారు.
All set?
— Alia Bhatt (@aliaa08) September 26, 2024
JIGRA THEATRICAL TRAILER out now!https://t.co/io1q8lqI2Y
See you in cinemas,11th October💥#KaranJohar@apoorvamehta18#ShaheenBhatt@somenmishra0#VedangRaina#ManojPahwa@Vasan_Bala@MARIJKEdeSOUZA@grishah#DebashishIrengbam@Viacom18Studios@DharmaMovies…
Also Read: S. P. Balasubrahmanyam : ఎస్పీ బాలుకు తమిళనాట అరుదైన గౌరవం.. CM స్టాలిన్ ఏం చేశారో తెలుసా?
 Follow Us
 Follow Us