S. P. Balasubrahmanyam : ఎస్పీ బాలుకు తమిళనాట అరుదైన గౌరవం.. CM స్టాలిన్ ఏం చేశారో తెలుసా?

గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం గౌరవార్థం తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీబీ పేరు పెట్టింది. ఈ విషయాన్ని సీఎం స్టాలిన్ నిన్న ఎస్పీబీ వర్ధంతి సందర్భంగా ప్రకటించారు.

New Update
SPB 11

SPB

SPB: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నాల్గవ వర్ధంతి సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన గౌరవార్థం తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ నగరానికి ఎస్పీబీ పేరు పేరును ప్రకటించారు. బాలసుబ్రహ్మణ్యం నివాసం ఉండే నుంగంబాక్కంలోని కాందార్ నగర్ మెయిన్ రోడ్డుకు ఎస్పీబీ అని పేరు పెట్టింది. ఈ విషయాన్ని నిన్న ఎస్పీబీ వర్ధంతి సందర్భంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రకటించారు.  

గానగంధర్వుడు.. ఎస్పీబీ

SP బాలసుబ్రహ్మణ్యం ప్రముఖ భారతీయ నేపథ్య గాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన 50 ఏళ్ళ సినీ కెరీర్ లో 16 భాషలలో 50,000 పాటలను ఆలపించారు. ఆరు జాతీయ చలన చిత్ర అవార్డులు, పద్మ శ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ తో సహా అనేక పురస్కారాలను పొందారు.  వివిధ భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి తన మధురమైన స్వరంతో ప్రేక్షకుల మదిలో చిరస్మరణీయంగా మిగిలిపోయిన గానగంధర్వుడు బాలసుబ్రహ్మణ్యం. పాటలతో పాటు అనేక సినిమాల్లో తన నటనతోనూ మెప్పించి.. ప్రజల గుండెల్లో బహుముఖంగా ప్రజ్ఞాశాలిగా స్థానం సొంతం చేసుకున్న ఎస్పీబీ 2020 సెప్టెంబర్ 25న తుది శ్వాస విడిచారు. బౌతికంగా ఆయన లేనప్పటికీ.. ఆయన పాటల రూపంలో ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో బ్రతికే ఉన్నారు. 

Also Read  :  కంగనాకు భారీ ఊరట.. 'ఎమర్జెన్సీ' విడుదలకు గ్రీన్ సిగ్నల్

Advertisment
Advertisment
తాజా కథనాలు