Akkineni Nagarjuna: తమ కుటుంబాన్ని అబాసుపాలు చేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సంచలన కామెంట్స్ చేశారు. తాను సింహం లాంటోడినని, తనను ఎవరూ బయపెట్టలేరంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'నేను ఎల్లప్పుడూ బలమైన వ్యక్తినే. నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో సింహాన్ని. ఇదంతా మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదం. తెలుగు పరిశ్రమ తమకు అండగా నిలబడినందుకు గర్వపడుతున్నా. తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు' అంటూ తనదైన స్టైల్ లో పోస్టులో రాసుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. అక్కినేని కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.