నేను సింహాన్ని.. నన్ను ఎవరూ బయపెట్టలేరు.. కింగ్ ఆన్ ఫైర్! తన ఫ్యామిలీని అబాసుపాలు చేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సంచలన కామెంట్స్ చేశారు. తాను సింహం లాంటోడినని, తనను ఎవరూ బయపెట్టలేరంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. అండగా నిలబడిన తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు తెలిపారు. By srinivas 05 Oct 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Akkineni Nagarjuna: తమ కుటుంబాన్ని అబాసుపాలు చేయడంపై సినీ నటుడు అక్కినేని నాగార్జున సంచలన కామెంట్స్ చేశారు. తాను సింహం లాంటోడినని, తనను ఎవరూ బయపెట్టలేరంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'నేను ఎల్లప్పుడూ బలమైన వ్యక్తినే. నా కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో సింహాన్ని. ఇదంతా మా నాన్న అక్కినేని నాగేశ్వరరావు ఆశీర్వాదం. తెలుగు పరిశ్రమ తమకు అండగా నిలబడినందుకు గర్వపడుతున్నా. తెలుగు చిత్ర పరిశ్రమకు కృతజ్ఞతలు' అంటూ తనదైన స్టైల్ లో పోస్టులో రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే.. అక్కినేని కుటుంబాన్ని, వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ గౌరవాన్ని, ప్రతిష్ఠ దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. అఖిల్ సీరియస్ వార్నింగ్.. మంత్రి కొండా సురేఖ వ్యవహరించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిదంటూ అఖిల్ అక్కినేని ఫైర్ అయ్యారు. ఆమె వ్యాఖ్యలతో తమ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనకు లోనయ్యారని పేర్కొన్నాడు. రాజకీయ స్వలాభం కోసం నిజాయితీ గల వ్యక్తులపై సురేఖ సిగ్గు లేకుండా మాట్లాడింది అంటూ చిర్రెత్తిపోయాడు. అక్కినేని కుటుంబ సభ్యుడిగా ఈ విషయంలో నేను మౌనంగా ఉండనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. సురేఖ లాంటి వ్యక్తులకు ఈ సమాజంలో చోటు ఉండకూడదని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆమె లాంటి వ్యక్తులను అసలు క్షమించకూడదన్నాడు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. #akkineni-nagarjuna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి